Brett Lee News: గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ రాసిన లేఖను.. తాజాగా ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నాడు. ప్రధాని మోదీ లేఖకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ పోస్టు పెట్టాడు. 'మీ నుంచి లేఖ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను మోదీజీ.. నాకు భారత్ అన్నా, అక్కడి ప్రజలన్నా ఎంతిష్టమో మీకు తెలియంది కాదు. క్రికెట్ కారణంగా భారత్ లాంటి అందమైన దేశంలో పర్యటించే అవకాశం రావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను' అని బ్రెట్ లీ ట్వీట్ చేశాడు.
'అద్భుతమైన ఆటతీరు, క్రీడాస్ఫూర్తితో భారత్‌లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. భారత సంస్కృతి, భాష పట్ల మీకున్న అభిమానం గురించి మాకు బాగా తెలుసు. భారతీయులతో మీకున్న అనుబంధం.. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలకు నిలువెత్తు నిదర్శనం. భారత్ - ఆస్ట్రేలియా దేశాల మధ్య ఎన్నో సామాజిక, ఆర్థిక సంబంధాలున్నాయి. భవిష్యత్తులోనూ ఇరుదేశాల మధ్య సఖ్యత ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను' అని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ.. వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌లకు లేఖలు రాశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: