Asia Cup 2022 : ఆసియా కప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 101 పరుగులు భారీ తేడాతో గెలిచింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ నిర్ణీత 20 ఓవర్లలో 111/8కే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ.. దాదాపు మూడేళ్ల తర్వాత శతకం కొట్టగా.. భువీ టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.
పేసర్ భువనేశ్వర్ కుమార్ సంచలన బౌలింగ్ వేశాడు. కేవలం నాలుగు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్లు వేసిన భువీ.. ఒక మెయిడిన్ చేయడమే కాకుండా ఐదు వికెట్లు తీశాడు. దీంతో అఫ్గాన్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. ఇప్పటివరకు 84 వికెట్లు తీసిన భువీ.. అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతకుముందు 83 వికెట్లతో స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అగ్రస్థానంలో కొనసాగాడు.
అఫ్గానిస్థాన్‌తో నామమాత్రమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. 1019 రోజుల తర్వాత విరాట్ కోహ్లీ శతకం బాదగా.. ఓపెనర్ కేఎల్ రాహుల్ (62) అర్ధ శతకంతో రాణించాడు. అనంతరం 213 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. భువీ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ డకౌట్ అయ్యాడు. చివరి బంతికి మరో ఓపెనర్ గుర్బాజ్‌ను సైతం పరుగులేమి చేయకుండానే పెవిలియన్‌కు సాగనంపాడు. తిరిగి మూడో ఓవర్ వేసిన భువీ.. నాలుగో బంతికి జనత్‌ను.. చివరి బంతికి నజీబుల్లాను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్లో.. భువనేశ్వర్ అజ్మతుల్లాను ఔట్ చేసి మెయిడిన్ చేశాడు. దీంతో సంచలన బౌలింగ్‌తో స్పెల్ ముగించాడు. టీ20ల్లో భువీకి ఇదే అత్యుత్తమ ప్రదర్శన.
టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత బౌలర్లలో టాప్‌లో దీపక్ చాహర్ ఉన్నాడు. 2019లో బంగ్లాదేశ్‌పై చాహర్ 7 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీశాడు. చాహల్ ఇంగ్లాండ్‌పై 2017లో 25 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీశాడు. భువీ ఇప్పుడు 4 పరుగులకు ఐదు వికెట్లు తీసి.. భారత్ తరఫున టీ20ల్లో మూడో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేశాడు.
ఇవీ చదవండి: కొట్టేశాడు.. కోహ్లీ సెంచరీ కొట్టేశాడు.. అఫ్గాన్‌పై వీరవిహారం.. రికార్డులే రికార్డులు
అఫ్ఘాన్ ప్లేయర్‌ను బ్యాట్‌తో కొట్టబోయిన పాక్ బ్యాటర్.. కుర్చీలు విసిరి ఫ్యాన్స్ విధ్వంసం!