ETV Bharat / sports

'అలా ఆడితే బౌలర్లకు, బౌలింగ్​ మెషీన్లకు తేడా ఏంటి?' - ఇయాన్ చాపెల్ కామెంట్స్​

దగ్గర బౌండరీలు, మంచి బ్యాట్లతో ఆడితే.. బాలర్లు వర్చువల్​ బౌలింగ్​ మెషీన్లుగా మారిపోయే ప్రమాదం ఉందని దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్​(ian chappell about grounds) అభిప్రాయపడ్డారు. ఈ పద్ధతిని సరిదిద్దాల్సిన అవసరం ఉందని చెప్పారు. క్రికెట్​లో వినోదంతో పాటు విలువలు కూడా పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్​ టోర్నీలో చాలా మ్యాచ్​లు టాస్​ గెలిచిన జట్టుకు అనుకూలంగా నిలిచాయని పేర్కొన్నారు.

ian Chappell
ఇయాన్ చాపెల్​
author img

By

Published : Nov 21, 2021, 1:21 PM IST

Updated : Nov 21, 2021, 2:47 PM IST

క్రికెట్​లో ప్రస్తుతం అనుసరిస్తున్న విధానంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ ఇయాన్ చాపెల్(Ian chappell news)​ కీలక వ్యాఖ్యలు చేశారు. అధునాతన బ్యాట్లు, దగ్గర బౌండరీల కాంబినేషన్​లో క్రికెట్ ఆడటం వల్ల బౌలర్లు వర్చువల్ బౌలింగ్ మెషీన్లుగా మారుతారని అభిప్రాయపడ్డారు. టీ20ల్లో ఆటకు, వినోదం మధ్య సమతుల్యతను పాటించేందుకు నిర్వాహకులు సరైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ క్రికెట్ వెబ్​సైట్​లో ఆయన వ్యాసం(Ian chappell column) రాశారు.

"బ్యాట్​, బంతికి మధ్య సమతుల్యాన్ని పాటించాల్సిన అవసరం నిర్వహకులకు ఉంది. క్రికెట్​ విలువలను అభిమానులకు బోధించాలి. మిడిల్ డెలివరీ బంతులను బ్యాటర్లు స్టాండ్స్​లో చేరిస్తే బాగుంటుంది. కానీ, అప్పుడు బౌలర్​ తీవ్ర ఆగ్రహానికి గురయ్యేలా పరిస్థితులు ఉండాలి. మంచి బ్యాట్లు, దగ్గర బౌండరీల్లో ఆడటం అనేది ఎంతవరకు సమంజసమో నాకు తెలీదు. ఇలా ఆడితే బౌలర్లు.. వర్చువల్​ బౌలింగ్ మెషీన్లలా మారిపోతారు. ఇది ఉత్తమ బౌలర్లపై ప్రభావం చూపుతుంది. ఈ తరహా సమస్య ఆస్ట్రేలియాలోని పెద్ద మైదానాల్లో మాత్రమే లేదు. ఈ పద్ధతిని తక్షణమే సరిదిద్దాల్సిన అవసరం ఉంది"

-ఇయాన్​ చాపెల్​, ఆసీస్ క్రికెట్ దిగ్గజం

"క్రికెట్​ అంటే వినోదం ఉండాలి. కానీ, అదే సమయంలో ఆటలో పూర్తిస్థాయి విలువలు ఉండాలి. భవిష్యత్తులో ఆటలను నిర్వహించేటప్పుడు నిర్వాహకులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది" అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నారు.

'టాస్​ ప్రధాన లోపం'

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్​లో 'టాస్​' అంశం కీలక పాత్ర పోషించిందని ఇయాన్ చాపెల్​ అభిప్రాయపడ్డారు. టాస్​ గెలిచిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా లభించాయని చెప్పారు. "దశాబ్దంకు పైగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టైటిల్​​ను ఎట్టకేలకు ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే.. ఈ టోర్నీలో చాలా మ్యాచ్​లు టాస్ గెలిచిన జట్లకు అనుకూలంగా నిలిచాయి. 'టాస్ గెలిస్తే.. గేమ్ గెలిచినట్లే' అనే విధంగా మారిపోయింది. టోర్నీలో ఇది ప్రధానమైన లోపం" అని చాపెల్ పేర్కొన్నారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 21, 2021, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.