ETV Bharat / sports

క్రేజీ ఐడియా.. వెదురుతో క్రికెట్​ బ్యాట్! - క్రికెట్​ బ్యాట్​

ప్రస్తుతం క్రికెట్​ బ్యాట్​లను కలపతో తయారు చేస్తున్నారు. మరోవైపు వెదురుతో బ్యాట్​లు తయారీపై పరిశోధనలు జరుగుతున్నాయి. కేమ్​బ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన దార్షిల్, బెన్​ టింక్లర్, దీనిపై రీసెర్చ్ చేసే పనిలో ఉన్నారు. అన్ని అనుకున్నట్లు కుదిరితే వెదురు బ్యాట్​లు త్వరలో మన ముందుకు రానున్నాయి.

cricket bat
క్రికెట్​ బ్యాట్​
author img

By

Published : May 10, 2021, 7:28 PM IST

Updated : May 10, 2021, 7:41 PM IST

క్రికెట్​ మైదానంలో బరిలోకి దిగే ఆటగాడి ఆయుధాల్లో బ్యాట్ ఒకటి​. సాధారణంగా వీటిని ఇంగ్లీష్​​ విల్లో లేదా కశ్మీర్​ విల్లోతో(ఓ రకమైన కలప) తయారు చేస్తారు. అయితే వెదురుతో చేసిన బ్యాట్లను వినియోగిస్తే ఎలా ఉంటుంది? బ్యాట్​ తయారీని విల్లోకు బదులు వెదురుతో తయారుచేస్తే ఎన్నో లాభాలు ఉన్నాయని ఓ అధ్యయనం చెబుతుంది. కేమ్​బ్రిడ్జ్​ యూనివర్సిటీకి చెందిన దార్షిల్​ షా, బెన్​ టింక్లర్​-డేవియెస్ ఈ పరిశోధన చేశారు.

"తక్కువ ధరకే వెదురుతో బ్యాట్​ తయారుచేయవచ్చు. కొత్తగా క్రికెట్ ఆడేవారికి ఫోరు కొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అన్ని రకాల షాట్లు కూడా బాగా ఆడొచ్చు. ఇంగ్లీష్​ విల్లోను సరఫరా చేయడంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. ఓ చెట్టు పెరగడానికి దాదాపు 15 ఏళ్లు పడుతుంది. దీంతో బ్యాట్​ తయారీలో 15 నుంచి 30 శాతం వృథాగా పోతుంది. అదే వెదురు చౌక, సమృద్ధి, వేగంగా దొరుకుతుంది. ఏడేళ్లలోనే వెదురు పెరగడం కలిసొచ్చే అంశం. దీనికి సంబంధించిన చెట్లు ఇప్పుడిప్పుడే క్రికెట్ అభివృద్ధి చెందుతున్న చైనా, జపాన్​, దక్షిణా అమెరికా లాంటి దేశాల్లోనూ ఎక్కువగా దొరుకుతాయి. అయితే దీనితో తయారు చేసిన బ్యాట్..​ విల్లో బ్యాట్​ కన్నా గట్టిగా, బలంగా, పెళుసుగా, బరువుగా ఉంటుంది. దాని బరువు తగ్గించే విధంగా తయారీకి ప్రయత్నిస్తున్నాం"

-దార్షిల్​ షా

1979 నుంచి క్రికెటర్లు వాడే బ్యాట్​ల రూపురేఖలపై కచ్చితమైన నిబంధన అమల్లోకి వచ్చింది. కలపతో చేసిన వాటినే ఉపయోగించాలని ఐసీసీ స్పష్టం చేసింది. వాటి​ పరిమాణం 38 అంగుళాల పొడవు, 4.25 అంగుళాల వెడల్పు మాత్రమే ఉండాలని సూచించింది.

ఇదీ చూడండి: విచిత్రమైన ఈ క్రికెట్​ బ్యాట్​లను ఎప్పుడైనా చూశారా..?

Last Updated : May 10, 2021, 7:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.