ETV Bharat / sports

కోహ్లీపై పాక్​ సారథి కామెంట్​.. వైరల్​గా మారిన ట్వీట్​ - కోహ్లీ బాబర్​ అజామ్​

Babar Azam Kohli: ఫామ్​లేమితో ఇబ్బంది పడుతున్న టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ కోహ్లీ గురించి పాక్​ సారథి బాబర్​ అజామ్​ ఓ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఆ ట్వీట్​ నెట్టింట్లో వైరల్​గా మారింది.

Babar azam tweet about virat Kohli
కోహ్లీ బాబర్​ అజామ్​
author img

By

Published : Jul 15, 2022, 10:49 AM IST

Babar Azam Kohli: టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ విరాట్​ కోహ్లీకి మూడేళ్లుగా అదృష్టం కలిసి రావడం లేదు. పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. జట్టులో స్థానం కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలోనూ తొమ్మిదో బంతికి కానీ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. అయితే ఫోర్‌తో తన ఇన్నింగ్స్‌ను ఆరంభించిన విరాట్ వరుసగా మరో రెండు బౌండరీలను బాదాడు. అయితే అంతలోనే తుస్సుమనిపించాడు. తన బలహీనతను బయటపెట్టుకొని పెవిలియన్‌కు చేరాడు. ఆఫ్‌సైడ్‌ పడిన బంతిని ఆడబోయిన విరాట్ (16) ఇంగ్లాండ్‌ కీపర్‌ జోస్ బట్లర్‌ చేతికి చిక్కాడు. దీంతో కోహ్లీ అభిమానులు మళ్లీ నిరాశపడ్డారు.ఈ క్రమంలో దాయాది దేశం పాకిస్థాన్‌ సారథి బాబర్‌ అజామ్‌ విరాట్‌కు మద్దతుగా నిలిచాడు. "త్వరలోనే ఇలాంటివి సమసిపోతాయి.. ధైర్యంగా ఉండు" అని ట్విటర్‌ వేదికగా మద్దతు తెలిపాడు. దీంతో ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గత కొన్నేళ్లుగా పాక్‌ తరఫున నిలకడగా రాణిస్తున్న బాబర్‌ అజామ్‌ను మరో విరాట్‌గా అక్కడి అభిమానులు భావిస్తుంటారు. ప్రస్తుతం ‌ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ బాబర్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇటీవలే టీ20 ర్యాంకింగ్స్‌లో కోహ్లీ రికార్డును అధిగమించాడు. 1013 రోజులపాటు విరాట్ టాప్‌ ప్లేస్‌తో కొనసాగగా.. దానిని బాబర్ దాటేశాడు. అదేవిధంగా కెప్టెన్‌గా కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో 1000కిపైగా పరుగులు చేయగా.. బాబర్‌ కేవలం 13 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఫీట్‌ను సాధించాడు.

ఇదీ చూడండి: లార్డ్స్‌లో చాహల్​ అద్భుతం.. 39 ఏళ్ల రికార్డు బద్దలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.