Australia Head coach Justin Langer resign: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కోచ్‌గా వ్యవహరించిన జస్టిన్ లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆ దేశ బోర్డుతో అనేక చర్చల అనంతరం.. లాంగర్ తన పదవి నుంచి వైదొలిగినట్లు అతడి మేనేజ్మెంట్ కంపెనీ డీఎస్ఈజీ ప్రకటన విడుదల చేసింది. "జస్టిన్ లాంగర్.. ఆస్ట్రేలియా పురుషుల క్రికెట్ జట్టు హెడ్‌కోచ్‌గా రాజీనామా చేశారు. క్రికెట్ ఆస్ట్రేలియాతో చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు." అని తెలిపింది.
కాగా, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుతో ఉన్న ఒప్పందం ప్రకారం జూన్ వరకు లాంగర్ పదవీకాలం ఉంది. అయితే దీర్ఘకాలం పాటు పదవీ కాలాన్నీ పొడిగించాలని అతడు కోరగా.. బోర్డుకు అందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు.
మరోవైపు జట్టులో ఉన్న ఆసీస్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్, ప్రస్తుత టెస్టు సారథి కమిన్స్, పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్ అరోన్ ఫించ్ సహా పలువురు కీలక ఆటగాళ్లతో లాంగర్‌కు భేదాలు తలెత్తినట్లు కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ విభేదాలు తారస్థాయికి చేరినట్లు తెలిసింది. ఈ కారణంగా బోర్డు.. లాంగర్‌ను కోచ్‌గా కొనసాగించేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది.
తాత్కాలిక కోచ్‌గా
లాంగర్.. కోచ్ బాధ్యతల్ని నుంచి వైదొలిగిన నేపథ్యంలో తాత్కాలిక హెడ్‌కోచ్‌ను నియమించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ను పురుషుల క్రికెట్ జట్టు కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియజేస్తామని పేర్కొంది.
ఇదీ చూడండి: ఈ అథ్లెట్ అందాలకూ గోల్డ్ మెడల్ ఇవ్వాలేమో!