Australia Cricket Neck Guard Rule : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తాజాగా ఓ కీలక నిర్ణయాం తీసుకుంది. ఇకపై మ్యాచ్ ఆడేందుకు మైదానంలోకి దిగే ప్లేయర్లు నెక్ గార్డ్‌ను తప్పనిసరిగా ధరించాలంటూ ఓ కొత్త రూల్ తీసుకొచ్చింది. దీని ప్రకారం అక్టోబర్ 1 నుంచి ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ, దేశవాళీ మ్యాచులు ఆడాలనుకునే ప్రతీ ప్లేయర్ కూడా నెక్ గార్డ్ వేసుకోవాల్సిందే అంటూ ఆంక్షలు జారీ చేసింది. దీంతో రానున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో ఆస్ట్రేలియా ప్లేయర్లు అందరూ మెడ పట్టీ వేసుకుని రంగంలోకి దిగనున్నారు.
-
An inspired performance by the Proteas sees Mitch Marsh's Aussie men lose their first match this tour.
— Cricket Australia (@CricketAus) September 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
On a day in which Tanveer Sangha debuted and took his first ODI wicket, David Warner also starred with the bat with 78 off 56 balls #SAvAUS pic.twitter.com/9Cg34IrVZ0
">An inspired performance by the Proteas sees Mitch Marsh's Aussie men lose their first match this tour.
— Cricket Australia (@CricketAus) September 12, 2023
On a day in which Tanveer Sangha debuted and took his first ODI wicket, David Warner also starred with the bat with 78 off 56 balls #SAvAUS pic.twitter.com/9Cg34IrVZ0An inspired performance by the Proteas sees Mitch Marsh's Aussie men lose their first match this tour.
— Cricket Australia (@CricketAus) September 12, 2023
On a day in which Tanveer Sangha debuted and took his first ODI wicket, David Warner also starred with the bat with 78 off 56 balls #SAvAUS pic.twitter.com/9Cg34IrVZ0
ఆ ఒక్క గాయం కారణంగా..
Cricket Australia New Rule : సౌతాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో కామెరూన్ గ్రీన్ మెడకి దెబ్బ తగిలింది. కగిసో రబాడా వేసిన ఓ బౌన్సర్ నేరుగా కామెరూన్ మెడకు తగిలింది. అయితే గ్రీన్ ధరించిన హెల్మెట్‌కు నెక్ గార్డ్ ఉండటం వల్ల తృటిలో ప్రమాదం తప్పింది. లేకుంటే రబాడా వేసిన బౌన్సర్ దెబ్బకి గ్రీన్ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది. ఇక ఈ మ్యాచ్‌తో ఓ గుణపాఠాన్ని నేర్చుకున్న ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఇకపై తమ క్రికెటర్ల అందరూ నెక్ గార్డ్ తప్పనిసరిగా ధరించాలంటూ రూల్ తీసుకొచ్చింది.
అయితే ఈ నిర్ణయం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ లాంటి కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. నెక్ గార్డ్ పెట్టుకోవడం వల్ల ఫ్రీగా మెడను తిప్పలేకపోతున్నామని, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేమంటూ అప్పట్లో వీరిద్దరూ వ్యాఖ్యానించారు. క్రికెట్ ఆడుతూ బౌన్సర్ బలంగా మెడకు తగలడం వల్లే ఆస్ట్రేలియా యంగ్ క్రికెటర్ ఫిలిప్ హ్యూజ్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. దీంతో అప్పటి నుంచే ప్లేయర్లు నెక్ గార్డ్ ధరించాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియా సూచనలు జారీ చేసింది. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేస్తూ తాజాగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఒకవేళ ఏ ప్లేయర్ అయినా మెడ పట్టీ లేకుండా బ్యాటింగ్ చేస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు కూడా జారీ చేసింది.
ICC ODI Ranking Team 2023 : వన్డే ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా టాప్.. భారత్ ప్లేస్ ఎంతంటే?