ETV Bharat / sports

కళ్లు చెదిరే ఫీల్డింగ్​.. క్యాచ్​ పట్టి ఉంటే.. - ఆస్టన్‌ అగర్‌ సిక్స్‌ని ఆపిన వీడియో

ఆస్ట్రేలియా క్రికెటర్​ ఆస్టన్‌ అగర్‌ చేసిన ఫీల్డింగ్ విన్యాసం ప్రస్తుతం నెట్టింట్లో వైరల్​గా మారింది. ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో సిక్సర్‌ వెళ్లాల్సిన బంతిని ఆపి ఔరా అనిపించుకున్నాడు.

aus vs eng ashton agar
ఆస్టన్‌ అగర్‌ సిక్స్‌ని ఆపిన వీడియో
author img

By

Published : Nov 17, 2022, 4:16 PM IST

ఇంగ్లాండ్​, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఆస్ట్రేలియా స్పిన్నర్‌ ఆస్టన్‌ అగర్‌ చేసిన విన్యాసం వల్ల అందరి దృష్టి అతడిపై పడింది. ఆ సమయంలో క్యాచ్‌ పట్టి ఉంటే మాత్రం కచ్చితంగా చరిత్రలో నిలిచిపోయేది. అయితే క్యాచ్‌ మిస్‌ అయినప్పటికి అతడి విన్యాసం మాత్రం సంచలనమే అవుతుంది. ఎందుకంటే సిక్సర్‌ వెళ్లాల్సిన బంతిని కేవలం ఒక్క పరుగుకే పరిమితం చేసి ఐదు పరుగులు సేవ్‌ చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.

ఇన్నింగ్స్‌ 45వ ఓవర్‌లో అప్పటికే సెంచరీతో అద్భుతంగా ఆడుతున్న డేవిడ్‌ మలాన్‌ కమిన్స్‌ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌వికెట్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు. చాలా ఎత్తులో బంతి వెళ్లడంతో పక్కాగా సిక్స్‌ అని అనుకున్నాడు. కానీ బౌండరీ లైన్‌ వద్ద ఉన్న ఆస్టన్‌ అగర్‌ సూపర్‌మ్యాన్‌లా పైకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని పట్టుకున్నాడు.

అయితే అప్పటికే బౌండరీ లైన్‌ దాటేశాడు అగర్​..దాంతో క్యాచ్‌ పట్టినా ఉపయోగముండదు. అందుకే బంతిని వెంటనే బౌండరీ లైన్‌ అవతలకు విసిరేసిన తర్వాతే కిందపడ్డాడు. అలా ఆరు పరుగులు రావాల్సింది పోయి ఇంగ్లాండ్​కు ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. ఆస్టన్‌ అగర్‌ చేసిన విన్యాసం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా అంతకుముందు లియామ్‌ డాసన్‌ను కూడా ఆస్టన్‌ అగర్‌ తన స్టన్నింగ్‌ ఫీల్డింగ్‌తో రనౌట్‌గా పెవిలియన్‌ చేర్చాడు.

ఇక డేవిడ్‌ మలాన్‌ సెంచరీతో(128 బంతుల్లో 134 పరుగులు, 12 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరవడంతో ఇంగ్లాండ్​ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది. డేవిడ్‌ విల్లీ(34 నాటౌట్‌), జాస్‌ బట్లర్‌(29 పరుగులు) మలాన్‌కు సహకరించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో పాట్‌ కమిన్స్‌, ఆడమ్‌ జంపాలు చెరో మూడు వికెట్లు తీయగా.. మిచెల్‌ స్టార్క్‌, స్టోయినిస్‌ చెరొక వికెట్‌ తీశారు.

ఇదీ చదవండి: 'ఇప్పుడైతే మా టార్గెట్​ ఆటను ఆస్వాదించడమే.. భవిష్యత్తు గురించి తర్వాత మాట్లాడతాం'

హార్దిక్​-కేన్​ విలియమ్స్​ రిక్షా సవారీ... వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.