Asia Cup 2023 Tilak Varma : హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ.. ఇప్పుడు ఇతడు ఓ సెన్సేషన్. టీ20 అరగేట్రంలోనే అదరగొట్టిన ఈ టీమ్ఇండియా యువ సంచలనం.. ఇప్పుడు వన్డేల్లో కూడా సత్తాచాటేందుకు సన్నద్ధమవుతున్నాడు. ఎవరూ ఊహించని విధంగా ఆసియాకప్-2023 భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్‌ను కాదని తిలక్ వైపే సెలక్టర్లు మొగ్గు చూపారు.
Tilak Varma ODI Debut : ప్రస్తుతం ఐర్లాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో తలపడుతున్న టీమ్ఇండియాలో 20 ఏళ్ల తిలక్‌వర్మ భాగంగా ఉన్నాడు. బుధవారం చివర టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ పర్యటన ముగియనుంది. ఆ తర్వాత తిలక్.. తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాతో కలిసి బెంగళూరులోని నేషనల్ అకాడమీకి చేరుకోనున్నాడు. ఆగస్టు 24 నుంచి జరగనున్న స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్‌లో పాల్గొనున్నాడు.
-
🗣️🗣️ I want to do well and I'm pretty confident playing one day cricket.@TilakV9 describes his feelings after getting selected for #AsiaCup2023 👌👌 - By @RajalArora #TeamIndia pic.twitter.com/79A85QGcug
— BCCI (@BCCI) August 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">🗣️🗣️ I want to do well and I'm pretty confident playing one day cricket.@TilakV9 describes his feelings after getting selected for #AsiaCup2023 👌👌 - By @RajalArora #TeamIndia pic.twitter.com/79A85QGcug
— BCCI (@BCCI) August 22, 2023🗣️🗣️ I want to do well and I'm pretty confident playing one day cricket.@TilakV9 describes his feelings after getting selected for #AsiaCup2023 👌👌 - By @RajalArora #TeamIndia pic.twitter.com/79A85QGcug
— BCCI (@BCCI) August 22, 2023
'చాలా సంతోషంగా ఉంది'
తాజాగా ఆసియాకప్‌కు ఎంపిక కావడం పట్ల తిలక్ వర్మ స్పందించాడు. ఆసియాకప్ వంటి మెగా టోర్నీకి సెలక్ట్ కావడం చాలా సంతోషంగా ఉందని తిలక్ తెలిపాడు. "ఆసియాకప్ వంటి మెగా ఈవెంట్‌తో వన్డే ఫార్మాట్‌లో అరంగేట్రం చేస్తానని అస్సలు అనుకోలేదు. భారత్ తరఫున వన్డేల్లో డెబ్యూ చేయాలని నేను ఎప్పటి నుంచో కలలు కంటున్నాను. నా కల త్వరలోనే నెరవేరనుంది. ఇది నాకు చాలా పెద్ద విషయం. నేను ఈ ఏడాదిలోనే టీ20ల్లో డెబ్యూ చేశాను. నెల తిరగకముందే ఆసియాకప్ వంటి మెగా టోర్నీకి ఎంపిక చేశారు. చాలా సంతోషంగా ఉంది." అంటూ చెప్పుకొచ్చాడు.
'అంతా రోహిత్ భాయ్ వల్లే'
"నాకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. అందుకు తగ్గట్టు సిద్ధ మవుతాను. ఐపీఎల్ సమయంలో నేను చాలా ఒత్తడికి గురయ్యాను. రోహిత్ భాయ్ నాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఎటువంటి భయం లేకుండా, నాకు నచ్చిన విధంగా ఆడమని సలహా ఇచ్చాడు. అదే విధంగా నాకు ఎటువంటి సందేహాలు ఉన్న తనని ఆడగమనేవాడు. నేను అతడి నుంచి చాలా విషయాలు నేర్చకున్నాడు" అని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తిలక్ పేర్కొన్నాడు.