Rahul Dravid Asia Cup 2023 : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఫిట్‌నెస్‌పై నెలకొన్న పలు అనుమానాలకు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెరదించాడు. ఆసియాకప్ 2023 టోర్నీ ఈ ఇద్దరూ బరిలోకి దిగుతారంటూ ద్రావిడ్ హింట్ ఇచ్చాడు. వెస్టిండీస్‌తో జరిగిన చివరి టీ20 తర్వాత మీడియాతో మాట్లాడిన రాహుల్ ఆయన ఈ విషయం గురించి పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా ఆసియాకప్ 2023 సన్నాహాల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దీంతో క్రికెట్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. బెంగళూరు వేదికగా ఆసియా కప్‌కు ముందు ప్రాక్టీస్ క్యాంపు ఉంటుందని చెప్పిన ఆయన.. గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న ఆటగాళ్లు ఈ క్యాంపులో వచ్చి రానున్న మ్యాచ్‌ల కోసం సన్నద్దం అవుతారని తెలిపాడు.
'గాయాల నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చేందుకు మాకు కొంతమంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. మేం వారికి ఆసియా కప్‌లో ఆడేలా అవకాశాలు ఇవ్వాలి. ఆగస్టు 23 నుంచి బెంగళూరు వేదికగా వారం రోజుల పాటు ప్రాక్టీస్ క్యాంప్ ఉంది. రీఎంట్రీ ఇచ్చే ఆటగాళ్లకు ఈ ప్రాక్టీస్ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతోంది. 'అని రాహుల్ ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.
Team India Players Injury : గత కొంత కాలంగా టీమ్ఇండియాలోని కొంత మంది ప్లేయర్లు గాయల కారణంగా క్రికెట్‌కు దూరమయ్యారు. జస్‌ప్రీత్ బుమ్రా , శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి స్టార్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటూ మళ్లీ తమ ఫామ్‌ను సాధించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలో బుమ్రా.. ఆగస్టు 18 నుంచి ఐర్లాండ్‌తో ప్రారంభంకానున్న మూడు టీ20ల సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
Asia Cup 2023 Team India : అయితే కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ మాత్రం బెంగళూరులోని ఎన్‌సీఏలో ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఫిట్‌గా లేరన్న వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ ఇద్దరూ ఆసియాకప్‌కు దూరమవుతారన్న ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. అయితే ద్రావిడ్ మాత్రం ఈ ఇద్దరు అందుబాటులోకి వచ్చారని తెలిపాడు. అయితే మరో రెండు రోజుల్లో ఆసియా కప్ 2023 కోసం ఎంచుకున్న భారత జట్టును ప్రకటించనున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ ఇద్దరు పేర్లు అందులో ఉండనుందో లేదో వేచి చూడాల్సిందే..
Asia Cup 2023 Schedule : ఆసియా కప్ షెడ్యూల్ వచ్చేసింది.. పాక్‌తో భారత్ పోరు అప్పుడే..
Asia cup 2023 ind vs pak venue : ఆసియా కప్ షెడ్యూల్ రెడీ.. భారత్-పాక్ మ్యాచ్ వేదిక ఇదే!