Ashes 2021: సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఆధిపత్యంతో ఏకపక్షంగా సాగుతున్న ప్రతిష్ఠాత్మక యాషెస్ సమరంలో మరో పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి మూడు మ్యాచ్‌ల్లో విజయకేతనం ఎగురవేసి సిరీస్ సొంతం చేసుకున్న కంగారూ జట్టు.. బుధవారం ఆరంభమయ్యే నాలుగో టెస్టులోనూ గెలుపే లక్ష్యంగా బరిలో దిగుతోంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇప్పటికే పరాజయాల బాధలో ఉన్న ఇంగ్లాండ్‌కు ఇప్పుడు కరోనా కారణంగా కోచ్‌లు కూడా అందుబాటులో లేకుండా పోయారు. ఈ నేపథ్యంలోనే నాలుగో టెస్టు కోసం తుది జట్లను ప్రకటించాయి.
ఇంగ్లాండ్
ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మంచి ప్రదర్శన కనబర్చిన పేసర్ ఒల్లీ రాబిన్సన్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండట్లేదు.
తుదిజట్టు
హమీద్, క్రాలే, మలన్, రూట్ (కెప్టెన్), స్టోక్స్, బెయిర్‌స్టో, బట్లర్, వుడ్, లీచ్, బ్రాడ్, అండర్సన్
ఆస్ట్రేలియా
కరోనా కారణంగా ఐసోలేషన్‌లో ఉన్న ఆసీస్ బ్యాటర్ ట్రెవిస్ హెడ్ ఈ మ్యాచ్‌లో ఆడట్లేదు. దీంతో ఇతడి స్థానంలో ఉస్మాన్ ఖవాజాకు చోటిచ్చింది యాజమాన్యం.
తుదిజట్టు
హారిస్, వార్నర్, లబుషేన్, స్మిత్, ఖవాజా, గ్రీన్, కారే, కమిన్స్ (కెప్టెన్), లియోన్, స్టార్క్, బోలాండ్