Arjun tendulkar IPL entry: దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ కుమారుడు అర్జున్.. ఈ ఏడాది ఐపీఎల్ అరంగేట్రం చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ అతడికి మాత్రం అవకాశం దక్కలేదు. దీంతో ముంబయి ఇండియన్స్‌పై సచిన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయమై స్పందించాడు ఎమ్ఐ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్. అర్జున్‌కు చోటు దక్కాలంటే ఇంకా కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పాడు.
"ముంబయి లాంటి జట్టు తరఫున ఆడాలంటే అర్జున్ ఇంకాస్త కష్టపడాల్సి ఉంటుంది. తుది జట్టులో చోటు సంపాదించాలంటే అకుంఠిత దీక్ష, పట్టుదల, కరోర శ్రమ ఇంకా చేయాల్సి ఉంటుంది. అర్జున్ బ్యాటింగ్, ఫీల్డింగ్‌పై అతడు ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అతడు మరింత కష్టపడితే పురోగతిని సాధించి జట్టులో స్థానాన్ని సంపాదించుకోగలడు" అని ముంబయి ఇండియన్స్ బౌలింగ్ కోచ్ షేన్ బాండ్ స్పష్టం చేశాడు.
కాగా, ఈ మెగావేలంలో అర్జున్ను ముంబయి రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. అతడు తన కెరీర్‍లో కేవలం 2 టీ20లు మాత్రమే ఆడాడు. 33.50 సగటుతో 2 వికెట్లు మాత్రమే తీశాడు.
ఇదీ చూడండి: గంగూలీ, షా ఇంగ్లాండ్ పర్యటన అందుకేనా?