ETV Bharat / sports

ఆమ్రపాలి వివాదంపై సుప్రీం కోర్టుకు మహేంద్ర సింగ్​ ధోనీ

author img

By

Published : Apr 25, 2022, 10:30 PM IST

Amrapali projects Dhoni: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సుప్రీంకోర్టు తలుపుతట్టాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదాలపై మధ్యవర్తిత్వం విషయంలో జోక్యం చేసుకోవాలని కోరాడు. ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశాడు.

DHONI AMRAPALI
DHONI AMRAPALI

Amrapali projects Dhoni: టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఆమ్రపాలి సంస్థతో నెలకొన్న వివాదంపై సుప్రీం తలుపుతట్టాడు. మధ్యవర్తిత్వ ప్రక్రియలో జోక్యం చేసుకోవాలని ధోనీ తరఫున హాజరైన న్యాయవాది ఉద్ధవ్ నందా సుప్రీంను కోరారు. తమకు మార్గదర్శనం చేయాలని అభ్యర్థించాడు. అయితే, ఏ రకమైన మధ్యవర్తిత్వ ప్రక్రియ అనే విషయాన్ని నందా తెలియజేయలేదు. ఈ వ్యాజ్యాన్ని మే 9న విచారించనున్నట్లు సుప్రీం తెలిపింది.

Dhoni moves SC: 2009-2016 మధ్య కాలంలో ధోనీని ప్రచారకర్తగా నియమించుకుంది ఆమ్రపాలి సంస్థ. పలు వ్యాపార విషయాల్లోనూ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ధోనీకి చెల్లించాల్సిన రూ.40 కోట్ల బకాయిలను ఇంతవరకూ చెల్లించలేదు. రాంచీలోని ఆమ్రపాలి సఫారీలో ధోని ఒక పెంటౌజ్‌ను బుక్‌ చేసుకున్నాడు. ఆ ఇల్లు విషయంలోనూ అతడికి యాజమాన్య హక్కులు కల్పించలేదు. సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న ధోని బాధ్యతలను అర్ధంతరంగా నిలిపివేసింది. మహీ భార్య సాక్షి కూడా ఈ సంస్థకు సంబంధించిన ఓ ఛారిటీ సంస్థతో వ్యాపార సంబంధాలు కలిగి ఉంది.

కాగా, ఆమ్రపాలి వల్ల నిలిచిపోయిన ప్రాజెక్టుల కోసం ఏడు బ్యాంకులు రూ.280 కోట్లను విడుదల చేశాయని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. వీటిని ఇతర పనుల కోసం వినియోగించకూడదని ఏడు బ్యాంకుల తరఫున హాజరైన న్యాయవాది సుప్రీంను కోరారు. దీనికి ధర్మాసనం అంగీకారం తెలిపింది.

ఇదీ చదవండి:

భార్య పర్మిషన్​తో మాజీ క్రికెటర్ రెండో పెళ్లి.. 28 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నా...

ఐపీఎల్​లో గబ్బర్ రికార్డు.. కోహ్లీ తర్వాత అతడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.