ETV Bharat / sports

చరిత్ర సృషించిన కివీస్ స్పిన్నర్ - వరల్డ్​లో మూడో బౌలర్​గా రికార్డ్! - న్యూజిలాండ్ వర్సెస్ భారత్ టెస్టు సిరీస్ 2021

Ajaz Patel 10 Wickets In An Innings : న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, సరిగ్గా రెండేళ్ల కిందట టెస్టు మ్యాచ్​లో సింగిల్ ఇన్నింగ్స్​లో 10 వికెట్లు నేలకూల్చాడు. దీంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్​గా రికార్డుకొట్టాడు.

ajaz patel 10 wickets in an innings
ajaz patel 10 wickets in an innings
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 4, 2023, 9:30 PM IST

Ajaz Patel 10 Wickets In An Innings :న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్, రెండేళ్ల కిందట ఇదే రోజు టీమ్ఇండియా​పై అరుదైన ఘనత అందుకున్నాడు. అతడు 2021లో ముంబయి వాంఖడే వేదికగా భారత్​తో జరిగిన టెస్టు సిరీస్​ రెండో మ్యాచ్​లో, తొలి ఇన్నింగ్స్​లో పది వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో జిమ్ లేకర్ (1956), అనిల్ (1999) కుంబ్లే తర్వాత ఈ ఘనత అందుకున్న మూడో బౌలర్​గా రికార్డులకెక్కాడు అజాజ్.

అతడు ఈ ఇన్నింగ్స్​లో 47.5 ఓవర్లు బౌలింగ్ చేసి 10 వికెట్లు నేలకూల్చాడు. అందులో 12 ఓవర్లు మెయిడెన్లుగా మలిచాడు. అతడి ధాటికి టీమ్ఇండియాలో స్టార్ బ్యాటర్లు ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ సహా రవిచంద్రన్ అశ్వన్ డకౌట్​ అయ్యారు. ఈ ఇన్నింగ్స్​లో ఓపెనర్ మయంక్ అగర్వాల్ (150) భారీ స్కోర్ చేయడం వల్ల టీమ్ఇండియా 325 పరుగులు సాధించింది. ఇక ఈ మ్యాచ్​లో టీమ్ఇండియానే 372 పరుగుల తేడాతో కివీస్​ను చిత్తుచేసింది.

  • On this day, Ajaz Patel became only the third bowler to take all 10 wickets in a Test innings against India at Wankhede.

    📸: BCCI pic.twitter.com/2BE7GfEaIn

    — CricTracker (@Cricketracker) December 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Anil Kumble 10 Wickets : టీమ్ఇండియా లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 1999లో పాకిస్థాన్​తో దిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్​లో, ఒకే ఇన్నింగ్స్​లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ ఇన్నింగ్స్​లో 26.3 ఓవర్లలో కుంబ్లే ఈ ఫీట్ సాధించాడు. దీంతో 43 ఏళ్ల తర్వాత, టెస్టు ఇన్నింగ్స్​లో 10 వికెట్లు పడగొట్టిన రెండో బౌలర్​గా కుంబ్లే చరిత్ర సృష్టించాడు. కాగా, భారత్​లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్​ కుంబ్లేనే. గత 21 ఏళ్లుగా ఈ రికార్డు అతడి పేరిటే ఉంది.

Jim Laker 10 Wickets : ఇంగ్లాండ్ బౌలర్ జిమ్ లేకర్ 1956లో ఆస్ట్రేలియాపై పది వికెట్లు పడగొట్టి, చరిత్ర సృష్టించాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్​లో 10 వికెట్లు దక్కించుకున్న తొలి బౌలర్​గా తన పేరును చరిత్రలో లిఖించుకున్నాడు లేకర్. అతడి ధాటికి ఆ మ్యాచ్​లో 9 మంది ఆసీస్ బ్యాటర్లు సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యారు.

Ind vs Pak Top 5 Wicket Takers : ఇండోపాక్ మ్యాచ్​ల్లో అత్యధిక వికెట్ల వీరులు వీళ్లే.. లిస్ట్​లో కుంబ్లే ప్లేస్ ఎంతంటే

కపిల్ దేవ్ రికార్డు బ్రేక్.. టెస్టుల్లో అశ్విన్ అరుదైన ఘనత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.