ETV Bharat / sports

'ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయింది'.. సచిన్​తో మీటింగ్​పై డివిలియర్స్ - sachin de villiers news

ఒకే ఫ్రేమ్​లో ఇద్దరు బ్యాటింగ్ దిగ్గజాలు కనిపించి అభిమానులకు సర్​ప్రైజ్ ఇచ్చారు. సచిన్ తెందూల్కర్, ఏబీ డివిలియర్స్ కలిసి కాసేపు కాలక్షేపం చేశారు. దీనిపై ఏబీ డివిలియర్స్ ఇన్​స్టాగ్రామ్​లో పోస్టు పెట్టాడు.

de Villiers Meets Sachin
de Villiers Meets Sachin
author img

By

Published : Nov 7, 2022, 7:21 PM IST

ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు ఒక్కచోటికి చేరారు. బ్యాటింగ్​తో మాయాజాలం చేసే మిస్టర్ 360 ఏబీ డివిలియర్స్.. క్రికెట్ దైవం సచిన్ తెందూల్కర్​ను కలిశాడు. ఈ విషయాన్ని ఏబీ ఇన్​స్టా ద్వారా వెల్లడించాడు. సచిన్​ను కలవడానికి ముందు, తర్వాత ఇన్​స్టాలో పోస్టులు పెట్టాడు.
"ఉత్సాహం పట్టలేకపోతున్నా. సచిన్​ను కలిసేందుకు ఎదురుచూస్తున్నా. నేను ఎంతో ఆరాధించేవారిలో ఆయన ఒకరు. క్రికెట్ ఆడే సమయంలో ఆయన ప్రదర్శించిన నైపుణ్యం అసాధారణం. అప్పటికి, ఇప్పటికి ఏమీ మారలేదు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి ఆయన స్ఫూర్తినిస్తున్నారు. నాకు కూడా" అంటూ సచిన్​తో మీటింగ్​కు ముందు డివిలియర్స్ పోస్ట్ చేశాడు. దీనికి స్పందించిన సచిన్.. తనకూ డివిలియర్స్ పట్ల అదే విధమైన గౌరవం ఉందని చెప్పాడు.

de Villiers Meets Sachin
సచిన్ ఇన్​స్టా పోస్ట్

మీటింగ్ పూర్తైన తర్వాత మరో పోస్ట్ చేసిన ఏబీ.. తెందూల్కర్​తో గడిపిన క్షణాల గురించి వెల్లడించాడు. "ఈయనతో కొన్ని గంటలు గడిపాను. సచిన్​ను ఇంటర్వ్యూ చేద్దామని అనుకున్నా. కానీ, ఆయన చెప్పిన దాన్ని వింటూ అవన్నీ మననం చేసుకోవడానికే నా సమయం అయిపోయింది. ఎంత అనుభవజ్ఞుడు. నాకు సమయం ఇచ్చిన 'మాస్టర్ బ్లాస్టర్​'కు ధన్యవాదాలు" అంటూ ఇన్​స్టాలో మరో పోస్ట్ పెట్టాడు.

de Villiers Meets Sachin
సచిన్, డివిలియర్స్

అయితే, వీరిద్దరూ ఎందుకు కలిశారనేది తెలియలేదు. వీరు మాట్లాడుకుంటుండగా వీడియోలో రికార్డు చేస్తుండటాన్ని బట్టి.. ఏదో ఇంటర్వ్యూ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరూ కలిసి ఎలాంటి సర్​ప్రైజ్ ఇస్తారోనని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి వీరిద్దరూ కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ.. మురిసిపోతున్నారు. "ఒకే ఫ్రేమ్​లో రెండు 'గోట్​'లు", "మిస్​ యూ లెజెండ్స్" అంటూ కామెంట్లు పెడుతున్నారు. "మీ ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేయాడన్ని నిషేధించాలి" అంటూ ఈ జోడీ ఎంత విధ్వంసరమో గుర్తుచేసేలా మరికొందరు పరోక్షంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.