ETV Bharat / sports

యూవీ 6 6 6 6 6 6కి 15ఏళ్లు.. కొడుకుతో కలిసి మ్యాచ్ చూసిన క్రికెటర్ - టీ20 వరల్డ్​ కప్​ 2007

Yuvraj Singh Six Sixes : ఒకే ఓవర్.. ఆరు సిక్స్​లు.. అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ.. ఇవన్నీ ఓకే మ్యాచ్​లోని ఒకే ఇన్నింగ్స్​లో యువరాజ్​ సింగ్​ సాధించిన ఘనత. ఈ రికార్డు సాధించి 15 ఏళ్లు నిండిన సందర్భంగా యూవీ ​​ తన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. తాజాగా కొడుకుతో కలిసి ఆ మ్యాచ్​ను వీక్షిస్తూ ఎంజాయ్ చేశాడు.

yuvaraj singh
15 years for yuvaraj singh six sixes in one over against england in stuart braod bowling
author img

By

Published : Sep 19, 2022, 3:36 PM IST

Yuvraj Singh Six Sixes : మొదటి బాల్​ సిక్స్​.. ప్రేక్షకుల్లో ఆనందం.. కేకలు ఈలలో స్టేడియం హోరెత్తిపోయింది. అంతలోనే రెండో బాల్​ ఎదుర్కొన్నాడు ఆ క్రికెటర్​. మళ్లీ అదే షాట్​. బంతి గాల్లోకి లేచింది. మళ్లీ సిక్స్. బౌలర్​పై ఒత్తిడి పెరుగుతోంది. బాల్​ వేగం పెరుగుతోంది. ముచ్చటగా మూడో సిక్స్​ కొడతాడా లేదా అని అందరోనూ ఆసక్తి మిన్నంటింది. అది కూడా ఫుల్ టాస్​ బాల్​. మళ్లీ క్రికెటర్​ బంతిని గాల్లోకి లేపాడు. మళ్లీ సిక్స్​. అదే ఊపుతో ఇంకో రెండు సిక్స్​లు. ఓవర్​లో ఐదు బంతులు అయిపోయాయి. ఇక ఆఖరి బాల్​కు​ అందరిలోనూ ఉత్కంఠ. స్టేడియంలో కేరింతలు మార్మోగాయి. ఒకవేళ ఇదే కనుక జరిగితే చరిత్రే. అప్పుడే ఆఖరి బాల్​.. గాల్లోకి బంతి.. అందిరి ఉత్కంఠకు తెరితీస్తూ ఆ బంతి ప్రేక్షకుల పోడియంలోకి చొచ్చుకెళ్లింది. అదే యువరాజ్​ సింగ్ ఆరు సిక్స్​ల అద్భుతం.

ఈ ఘనతకు వేదికైంది కింగ్స్​మిడ్​ స్టేడియం వేదికైంది. సౌత్​ ఆఫ్రికాలో 2007లో జరిగిన టీ20 వరల్డ్​ కప్ సెమీఫైనల్​లో భారత్​ ఇంగ్లాండ్​ తలపడ్డాయి. అందులో ఇంగ్లాండ్​ బౌలర్​ స్టువర్ట్​ బ్రాడ్​ వేసిన ఓవర్​లో.. యవరాజ్​ ఆరు సిక్స్​లు బాదాడు. 12 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడు. 15 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు యువరాజ్ ఈ ఘనత సాధించాడు.

ఈ సందర్భంగా యువరాజ్​ సింగ్​ స్పందించాడు. ట్విట్టర్​లో ఓ పోస్ట్​ పెడుతూ.."15 సంవత్సరాల తర్వాత ఈ ఘనత చూడడానికి ఇంతకంటే మంచి పార్ట్​నర్​ దొరకడు" అని తన కుమారుడ్ని ఓళ్లో కూర్చోబెట్టుకుని.. ఆరు సిక్స్​ల కొట్టిన మ్యాచ్​ను టీవీలో చూస్తూ ఉన్న ఫొటోను షేర్​ చేస్తూ రాసుకొచ్చాడు. యువరాజ్​ ఆరు సిక్స్​లు కొడుతున్న వీడియోను ఐసీసీ కూడా పోస్ట్​ చేసింది. అత్యంత వేగంగా 12 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేశాడని క్యాప్షన్​ పెట్టింది.

అయితే ఈ మ్యాచ్​లో ఇంగ్లాండ్​కు.. భారత్​ 218 పరుగుల టార్గెట్​ విధించింది. 18 పరుగుల తేడాతో ఇంగ్లాడ్​పై ఘన విజయం సాధించింది. తన అద్భుత ప్రదర్శనతో యువరాజ్​ మ్యాన్ ఆప్​ ది మ్యాచ్​, మ్యాన్ ఆఫ్​ది టోర్నమెంట్​ అవార్డులు అందుకున్నాడు. మొత్తం టోర్నమెంట్​లో 362 పరుగులు చేసి 15 వికెట్లు తీశాడు.

ఇవీ చదవండి: భారత్​తో ఆసీస్ ఢీ.. టీ20 ప్రపంచకప్​న​కు రిహార్సల్స్​ !

'విరాట్ కోహ్లీతో తిప్పలు తప్పవు.. అతడు మాకు సవాలే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.