ETV Bharat / sports

Indonesia Masters 2021: సెమీస్​కు దూసుకెళ్లిన సింధు, శ్రీకాంత్ - కిదాంబి శ్రీకాంత్

ఇండోనేషియా మాస్టర్స్​లో (Indonesia Masters 2021) ప్రపంచ ఛాంపియన్ పీవీ సింధు జోరు కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మ్యాచ్​లో ప్రత్యర్థి ఇగిట్​ను చిత్తుగా ఓడించి సెమీస్​కు దూసుకెళ్లింది. పురుషుల సింగిల్స్​లో హెచ్​ఎస్​ ప్రణయ్​ను ఓడించి సెమీస్​కు చేరుకున్నాడు శ్రీకాంత్.

PV sindhu news
పీవీ సింధు
author img

By

Published : Nov 19, 2021, 7:27 PM IST

ఇండోనేషియా మాస్టర్స్ (Indonesia Masters 2021)​ సూపర్​ 750లో భారత్​ జోరు కొనసాగుతోంది. బాలిలో శుక్రవారం జరిగిన క్వార్టర్​ ఫైనల్లో ఘన విజయాలతో సెమీస్​లోకి అడుగు పెట్టారు స్టార్​ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్.

మహిళల సింగిల్స్​లో టర్కీకి చెందిన నెస్లిహాన్​​ ఇగిట్​పై 21-13, 21-10 తేడాతో వరుస సెట్లలో గెలుపొందింది సింధు (PV sindhu news). 35 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్​లో సింధు.. ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించింది.

హెచ్​ఎస్​ ప్రణయ్​పై 21-7, 21-18 తేడాతో వరుస సెట్లలో (Kidambi Srikanth vs HS Prannoy) గెలిచిన శ్రీకాంత్.. సెమీస్​కు దూసుకెళ్లాడు. తొలి సెట్​లో ఘోర పరాభవం చవిచూసిన ప్రణయ్​.. రెండో సెట్​లో పుంజుకున్నట్లు కనిపించినా.. చివరికి శ్రీకాంత్​ (Kidambi Srikanth) పైచేయి సాధించాడు.

ఇదీ చూడండి: ప్రకాశ్​ పదుకొణెకు జీవిత సాఫల్య పురస్కారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.