ETV Bharat / sports

నా దృష్టంతా 2021పైనే: పీవీ సింధు - సింధు బ్యాడ్మింటన్ వార్తలు

ఈ ఏడాది ఎలాంటి టోర్నీల్లో పాల్గొనని చెప్పిన స్టార్ షట్లర్ సింధు.. వచ్చే ఏడాదిపైనే తన దృష్టంతా ఉందని తెలిపింది.

PV Sindhu sets her sight on 2021 return
నా దృష్టంతా 2021పైనే: పీవీ సింధు
author img

By

Published : Oct 16, 2020, 9:07 PM IST

ప్రపంచ ఛాంపియన్​షిప్స్ విజేత పీవీ సింధు.. ఈ ఏడాది ఎలాంటి టోర్నీల్లోనూ ఆడేలా కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా వెల్లడించింది. తన దృష్టంతా 2021పైనే ఉందని చెప్పింది.

ఇటీవలే జరిగిన డెన్మార్క్ ఓపెన్ నుంచి తప్పుకున్న సింధు.. వచ్చే ఏడాది జనవరిలోనే కోర్టులో అడుగుపెడతానని తెలిపింది. టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనే తనపై ఈ అంశాలేవి ప్రభావం చూపవని అభిప్రాయపడింది.

"బ్యాడ్మింటన్​ను చాలా మిస్సవుతున్నాను. కానీ ప్రతిరోజూ ఇంట్లో ప్రాక్టీసు చేస్తూనే ఉన్నాను. మళ్లీ కోర్టులో అడుగుపెడితే కుదురుకోవాడానికి ఒకటి, రెండు వారాలు మాత్రమే పడుతుంది. ప్రస్తుతానికి బాగానే ఉన్నాను. టోర్నీలు ప్రారంభం కావడం గురించి ఎదురుచూస్తున్నాను. ఏడు నెలల విరామం తర్వాత గేమ్​ను మెరుగుపరుచుకోవడం ఎవరికైనా కష్టమే" -పీవీ సింధు, స్టార్ షట్లర్

చివరగా మార్చిలో జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్​లో సింధు ఆడింది. ఆ తర్వాత లాక్​డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోయింది. ఈ సమయంలో పెయింటింగ్, వంట చేయడంలో ప్రావీణ్యం తెచ్చుకుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.