థాయ్‌లాండ్ ఓపెన్‌లో రెండో రౌండ్‌కు చేరుకున్నాడు భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్. రసవత్తరంగా జరిగిన మొదటి రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని 18-21, 21-16, 23-21 తేడాతో ఓడించాడు. ఓ సమయంలో అలసటతో శరీరం సహకరించకపోయినా పట్టు వదలకుండా మ్యాచ్‌ను గెలిచి అందిరి ప్రశంసలు పొందాడు.
మొదటి సెట్లో ఓడిపోయిన తర్వాత క్రిస్టీకి గట్టి పోటీ ఇచ్చాడు ప్రణయ్. ఓ సమయంలో మ్యాచ్ నుంచి తప్పుకుంటాడేమే అనుకునేలా ఎడమ భుజం నొప్పితో విలవిలలాడాడు. కానీ ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఆడిన ప్రణయ్ ఆలోచన ముందు జొనాథన్ తలవంచక తప్పలేదు.
-
Amazing from @PRANNOYHSPRI 👏
— BWF (@bwfmedia) January 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
🗣️ "I had a fall when he had match point and hurt my left shoulder. I felt it was dislocated but it went back into place. Right now it's ok but it might start hurting again after a while.”#HSBCbadminton #BWFWorldTour #ToyotaThailandOpen pic.twitter.com/dF0RA36w5u
">Amazing from @PRANNOYHSPRI 👏
— BWF (@bwfmedia) January 20, 2021
🗣️ "I had a fall when he had match point and hurt my left shoulder. I felt it was dislocated but it went back into place. Right now it's ok but it might start hurting again after a while.”#HSBCbadminton #BWFWorldTour #ToyotaThailandOpen pic.twitter.com/dF0RA36w5uAmazing from @PRANNOYHSPRI 👏
— BWF (@bwfmedia) January 20, 2021
🗣️ "I had a fall when he had match point and hurt my left shoulder. I felt it was dislocated but it went back into place. Right now it's ok but it might start hurting again after a while.”#HSBCbadminton #BWFWorldTour #ToyotaThailandOpen pic.twitter.com/dF0RA36w5u
రెండు నెలల క్రితం కరోనా బారిన పడిన తర్వాత దాదాపు రెండు వారాలు ఫిట్నెస్ కోసం శ్రమించాడు ప్రణయ్. తన మానసిక స్థితిని మెరుగుపర్చుకునేందుకు చాలా కష్టపడ్డాడు. కాగా, యోనెక్స్ థాయ్‌లాండ్ ఓపెన్ ప్రారంభ సమయంలోనూ ఇతడికి కరోనా సోకినట్లు తప్పుడు రిపోర్టు వచ్చింది. మరోసారి పరీక్ష చేయగా నెగిటివ్‌గా తేలింది.