ETV Bharat / sports

Olympics: కొత్త టెక్నిక్స్​తో సింధు.. ఒలింపిక్స్​కు రెడీ - tokyo olympics sindh practice

ఒలింపిక్స్​లో(Olympics) తన ప్రత్యర్థులను మట్టి కరిపించేందుకు కొత్త నైపుణ్యాలను, టెక్నిక్స్​ను నేర్చుకుంటున్నట్లు తెలిపింది స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu). సైనా నెహ్వాల్​, కిదాంబి శ్రీకాంత్​ కూడా ఈ పోటీల్లో పాల్గొని ఉంటే బాగుండేదని చెప్పింది.

sindhu
పీవీ సింధు
author img

By

Published : Jun 3, 2021, 4:05 PM IST

Updated : Jun 3, 2021, 4:23 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో(Olympics) స్వర్ణమే లక్ష్యంగా చెమటోడుస్తున్న భారత స్టార్​ షట్లర్​ పీవీ సింధు(PV Sindhu).. ఈ మెగాక్రీడల్లో తన ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కొత్త నైపుణ్యాలు, టెక్నిక్స్​ నేర్చుకుంటున్నట్లు తెలిపింది. వాటిని అమలు చేసేలా నిరంతరం సాధన చేస్తున్నట్లు వెల్లడించింది.

ఒలిేంపిక్స్​కు స్పెయిన్ స్టార్​ కరోలినా మారిన్ మోకాలి గాయంతో దూరం కానుంది. ఆమె​ లేనప్పటికీ పోటీ చాలా తీవ్రంగానే ఉంటుందని సింధు పేర్కొంది. "టాప్​-10 ప్లేయర్స్​ అందరూ ఒకే సామర్థ్యంతో ఉంటారు. కాబట్టి ఒక్కరు లేనంత మాత్రాన ఈ పోటీలను తక్కువ అంచనా వేయలేం. నేను విశ్రాంతి తీసుకోను. నా వంతుగా మంచి ప్రదర్శన చేయడానికి, ఆటపై మరింత దృష్టి పెట్టి శ్రమిస్తున్నాను" అని చెప్పింది.

వాళ్లు ఆడితే బాగుండేది

కరోనా కారణంగా ఒలింపిక్స్​​ అర్హత పోటీలు రద్దు అవ్వడం వల్ల స్టార్​ ప్లేయర్స్​ సైనా నెహ్వాల్(Saina Nehwal)​, శ్రీకాంత్(Kidambi Srikanth)​ ఈ మెగాక్రీడలకు దూరమయ్యారు. దీనిపై స్పందించిన సింధు.. వారిద్దరూ ఒలింపిక్స్​లో పాల్గొని ఉంటే బాగుండేదని చెప్పింది.

రియో ఒలింపిక్స్​లో వెండి పతకంతో సరిపెట్టుకున్న సింధు (PV Sindhu).. 2019లో ప్రపంచ బ్యాడ్మింటన్​ ఛాంపియన్​షిప్స్​లో విజేతగా నిలిచి అదరగొట్టింది. ప్రస్తుతం ఏడో ర్యాంక్​లో ఉన్న ఈమె​.. ఇప్పటికే మూడు ప్రపంచ ఛాంపియన్​షిప్​ ఫైనల్స్ ఆడిన అనుభవం, ఆసియన్ గేమ్స్ రజతం, కాంస్య పతకాలు గెలవడం సహా కామన్వెల్త్ క్రీడల్లో వెండి పతకాన్ని గెలుచుకుంది. అదే ఊపులో టోక్యో మెగాక్రీడలకు సిద్ధమవుతోంది.

ఇదీ చూడండి Tokyo Olympics: ఈ ఐదుగురికి పతకాలు పక్కా!

Last Updated : Jun 3, 2021, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.