ETV Bharat / sports

BWF World Tour Finals: సింధు, శ్రీకాంత్ శుభారంభం - ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ శ్రీకాంత్ రెండో రౌండ్

BWF World Tour Finals: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీని భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ విజయంతో ప్రారంభించారు. తొలి రౌండ్​లో లినే క్రిస్టోఫెర్సెన్​పై సింధు, టోమా జూనియర్ పొపోవ్​పై శ్రీకాంత్ గెలుపొంది రెండో రౌండ్​కు చేరుకున్నారు.

Sindhu, Srikanth World Tour Finals, World Tour Finals latest news, సింధు, శ్రీకాంత్ శుభారంభం, వరల్డ్ టూర్ ఫైనల్స్ లేటెస్ట్ న్యూస్
Sindhu, Srikanth
author img

By

Published : Dec 1, 2021, 7:15 PM IST

PV Sindhu World Tour Finals: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌లో భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, కిదాంబి శ్రీకాంత్ రెండో రౌండ్​కు చేరుకున్నారు. మొదటి రౌండ్​లో డెన్మార్క్ క్రీడాకారిణి లినే క్రిస్టోఫెర్సెన్​పై 21-14, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది సింధు. ఇక శ్రీకాంత్ ఫ్రాన్స్​కు చెందిన టోమా జూనియర్ పొపోవ్​పై 21-14, 21-16 తేడాతో గెలిచి టోర్నీలో ముందంజ వేశాడు.

రెండో రౌండ్​లో జర్మనీకి చెందిన యూవొన్నే లీతో సింధు తలపడనుండగా.. థాయ్​లాండ్ షట్లర్ కున్లవత్​తో పోటీపడనున్నాడు శ్రీకాంత్.

డబుల్స్​లో నిరాశ

మహిళల డబుల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ జోడీ అశ్విని పొన్నప్ప-సిక్కిరెడ్డి జపాన్​కు చెందిన నమి మట్సుయమా-చిహరు షిదా చేతిలో 14-21, 18-21 తేడాతో ఓడిపోయింది.

ఇవీ చూడండి: IPL Retention 2022: 'ఆరెంజ్ ఆర్మీ'కి రుణపడి ఉంటా: రషీద్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.