ETV Bharat / sports

ఒలింపిక్స్​కు అర్హత సాధిస్తా: శ్రీకాంత్​ - Srikanth olympics qualification

మలేషియా ఓపెన్​, సింగపూర్​ ఓపెన్ వాయిదా లేదా రద్దు అయినప్పటికీ ​ఒలింపిక్స్​కు అర్హత సాధించేలా బీడబ్ల్యూఎఫ్ ప్లేయర్స్​కు అవకాశం కల్పిస్తుందని​ తాను ఎదురుచూస్తున్నట్లు చెప్పాడు షట్లర్​ కిదాంబి శ్రీకాంత్​. తాను అర్హత సాధిస్తానన్న నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు.

sreekanth
శ్రీకాంత్​
author img

By

Published : May 13, 2021, 7:16 PM IST

మలేసియా​ ఓపెన్​ వాయిదా, సింగపూర్​ ఓపెన్​ రద్దు వల్ల ఒలింపిక్స్​ అర్హత సాధించాలనుకున్న కిదాంబి శ్రీకాంత్​, సైనా నెహ్వాల్​కు ఉన్న అవకాశాలు చేజారిపోయాయి. అయితే తనకు మాత్రం ఈ మెగాక్రీడల అర్హతపై ఆశలు పోలేదని శ్రీకాంత్ అన్నాడు​. తాను అర్హత సాధిస్తాననే నమ్మకంతో ఉన్నట్లు తెలిపాడు.

ఒలింపిక్స్​ అర్హత పోటీల నిర్వహణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామని బీడబ్ల్యూఎఫ్​ బుధవారం ప్రకటించింది. దీని గురించి మాట్లాడిన శ్రీకాంత్.. "ఈ క్వాలిఫయర్స్​లో నేను ఆడితే అర్హత సాధిస్తాను. కానీ ప్రస్తుతం నా చేతిలో ఏమీ లేదు. బీడబ్ల్యూఎఫ్, ఆటగాళ్లను దృష్టిలో ఉంచుకుని ​ఏమైనా అవకాశం కల్పించేలా చేస్తుందని భావిస్తున్నాను. నిజానికి బీడబ్ల్యూఎఫ్​ ఏదో చేస్తుందని కాదు కానీ, నేను అర్హత సాధిస్తాననే సానుకూల దృక్ఫథంతో ఉన్నాను. ఆగస్టు వరకు ఏ టోర్నీ లేకపోవడం, తెలంగాణాలో లాక్​డౌన్​ వల్ల ప్రస్తుతానికి విరామం తీసుకున్నాను. శిక్షణ తీసుకోవడానికి అనుమతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ అనుమతి దొరికితే వచ్చే వారం నుంచి ట్రైనింగ్​ మొదలుపెడతాను" అని​ అన్నాడు.

టోక్యో ఒలింపిక్స్​ సింగిల్స్​ విభాగంలో భారత షట్లర్లు పీవీ సింధు, సాయి ప్రణీత్​.. డబుల్స్​లో చిరాగ్​ శెట్టి, సాత్విక్​ సాయిరాజ్​ అర్హత సాధించారు. వీరందరూ ఈ ఓపెన్స్​ రద్దు అవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రణీత్, చిరాగ్​-సాత్విక్​​.. వచ్చే వారం నుంచి ఒలింపిక్స్​ కోసం శిక్షణ ప్రారంభిస్తారని చెప్పారు. ప్రస్తుతానికి విరామం తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఈ ఓపెన్​ ఈవెంట్స్​ రద్దు అవ్వడం నష్టమే అయినప్పటికీ కొంచెం లాభం కూడా ఉందని అన్నారు పీవీ సింధు తండ్రి పీవీ రమణ, ప్రణీత్​.

ఇదీ చూడండి: సింగపూర్​ ఓపెన్​ రద్దు.. సైనా, శ్రీకాంత్​ ఆశలు గల్లంతు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.