సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవిత కథపై వెబ్‌సిరీస్ రూపొందనుంది. ప్రముఖ రచయిత హిందోల్ సేన్‌గుప్తా రాసిన 'ది మాన్ హూ సేవ్డ్ ఇండియా' పుస్తకం ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. బోహ్రా బ్రదర్స్ ఈ సిరీస్‌కు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
పటేల్ జీవితంలోని కీలక ఘట్టాలను ఇందులో చూపించబోతున్నారు. గుజరాత్‌లోని ఓ సాధారణ కుర్రాడు... కఠినమైన బ్రిటీష్ న్యాయవిద్యను ఎలా అభ్యసించాడు, స్వాతంత్ర్య పోరాట యోధుడిగా ఎలా మారాడు, రాజకీయాల్లో ఏ విధంగా రాణించాడనే అంశాల ఈ వెబ్ సిరీస్‌లో ఉంటాయని నిర్మాతలు తెలిపారు.
"బ్రిటన్‌లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత భారత్‌కు వచ్చిన పటేల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి గాంధీజిని అనుసరించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి మహాత్ముని నుంచి సర్దార్ అనే బిరుదుని స్వీకరించారు. పటేల్ గొప్ప నాయకుడు." -- సునీల్ బోహ్రా, నిర్మాత
ఈ కథను సునీల్ బోహ్రా సమర్థవంతంగా తెరకెక్కిస్తారని హిందోల్ సేన్‌గుప్తా తెలిపారు.