ETV Bharat / sitara

'ఇంటర్​స్టెల్లార్' కబుర్లు చెప్పకమ్మా.. సుకుమార్​తో బాలయ్య - బాలయ్య అన్​స్టాపబుల్ పుష్ప ఎపిసోడ్

Unstoppable with nbk: 'అన్​స్టాపబుల్' కొత్త ఎపిసోడ్​ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చేసింది. బాలయ్య తనదైన శైలిలో పంచులు వేసి అలరించారు.

balayya allu arjun
బాలయ్య అల్లు అర్జున్
author img

By

Published : Dec 26, 2021, 10:06 PM IST

Pushpa unstoppable episode: 'ఇంటర్‌స్టెల్లర్‌' దర్శకులతో ఇదే గొడవయ్యా. సినిమాలూ అలాగే ఉంటాయి. గెటప్‌లూ అలానే ఉంటాయి' అంటూ సుకుమార్‌ను ఆటపట్టించారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ (bala krishna). ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న షో 'అన్‌స్టాపబుల్‌' (Unstoppable). ఈ కార్యక్రమానికి 'పుష్ప' (Pushpa) టీమ్‌ అల్లు అర్జున్‌ (Allu arjun), రష్మిక(Rashmika), దర్శకుడు సుకుమార్‌ (sukumar) వచ్చి సందడి చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ- సుకుమార్‌ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'మీరు నాకు చాలా పరిచయం కానీ, నేను మీకు పరిచయం తక్కువ' అని సుకుమార్‌ అంటే 'ఎలాగో చెప్పండి' అని బాలకృష్ణ ఎదురు ప్రశ్నించారు. 'ప్రత్యక్షంగా కాకపోయినా, ఎప్పుడూ మిమ్మల్ని చూస్తూ పెరిగాం కాబట్టి, మీరు మాకు బాగా పరిచయం' అని అనగానే 'ఇంటర్‌స్టెల్లర్‌ కబర్లు చెప్పకమ్మా' అంటూ బాలయ్య పంచ్‌డైలాగ్‌ వేశారు. దీంతో సుకుమార్‌ నవ్వాపుకోలేకపోయారు.

రష్మిక నవ్వుతుంటే చాలా అందంగా ఉందని బాలకృష్ణ కితాబిచ్చారు. అల్లు అర్జున్‌తో కలిసి ‘పుష్ప’లో డైలాగ్‌ చెబుతూ తొడకొట్టారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.