ETV Bharat / sitara

దర్శకుడు రేప్ చేశాడని​ టీవీ నటి ఆరోపణ

పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టిన ఓ కాస్టింగ్​ డైరెక్టర్..​ తనపై రెండేళ్లుగా పలుమార్లు అత్యాచారం జరిపాడని బుల్లితెర నటి ఆరోపించింది. సదరు డైరెక్టర్​పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.

author img

By

Published : Nov 30, 2020, 10:23 AM IST

TV actress accuses casting director of rape in Mumbai
డైరెక్టర్​ అత్యాచారం చేశాడని బుల్లితెర నటి ఆరోపణ

తనపై లైంగిక దాడి జరిగిందని హిందీ టీవీ నటి, పోలీసులను ఆశ్రయించింది. కాస్టింగ్​ డైరెక్టర్​ ఆయుష్​ తివారీ.. తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఈ విషయమై సెక్షన్​ 376 కింద అతడిపై ముంబయిలోని వెర్సోవా పోలీసు స్టేషన్​లో కేసు నమోదైంది.

వివాహం చేసుకుంటానని మభ్యపెట్టి, గత రెండేళ్లుగా తనపై అత్యాచారం చేశాడని సదరు నటి, ఫిర్యాదులో పేర్కొన్నట్లు వెర్సోవా​ పోలీసు అధికారి వెల్లడించారు. నవంబరు 26న కాస్టింగ్​ డైరెక్టర్​పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: గాంధీని హత్య చేసిన గాడ్సేపై సినిమా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.