ETV Bharat / sitara

మూడు నెలల తర్వాత 'జబర్దస్త్​'గా షూటింగ్ - సుమ క్యాష్

ఈటీవీలో ప్రసారమయ్యే 'జబర్దస్త్' షో చిత్రీకరణ ప్రారంభం కాగా, 'క్యాష్' షూటింగ్​ రేపటి(జూన్ 18) నుంచి రామోజీ ఫిల్మ్​సిటీలో మొదలుకానుంది.

'జబర్దస్త్​'గా షూటింగ్ మొదలుపెట్టారు
అనసూయ రష్మి గౌతమ్
author img

By

Published : Jun 17, 2020, 3:59 PM IST

తెలుగువారికి నచ్చే, మెచ్చే అద్భుతమైన కామెడీ షో 'జబర్దస్త్' షూటింగ్​ మొదలైంది. కరోనా ప్రభావంతో దాదాపు మూడు నెలల నుంచి నిలిచిపోయిన చిత్రీకరణ తాజాగా ప్రారంభమైంది. వ్యాఖ్యాత అనసూయ ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్​స్టాలో పంచుకుంది. కొద్దిమంది సిబ్బంది మాత్రమే పాల్గొన్నారని, పూర్తిస్థాయి జాగ్రత్తలు తీసుకుని పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. సుమ యాంకర్​గా వ్యవహరిస్తున్న 'క్యాష్' షో షూటింగ్​.. జూన్ 18 నుంచి రామోజీ ఫిల్మ్​సిటీలో జరగనుంది.

లాక్​డౌన్​ నిబంధనల్లో తెలంగాణ ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో ఇటీవలే పలు టీవీ సీరియళ్లు, షోల చిత్రీకరణలు షురూ చేశారు. పలు జాగ్రత్తలు తీసుకుని వీటిని జరుపుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.