ఈ పేరు వినగానే ప్రేక్షకుల్లో పూనకం వస్తుంది. యూత్‌కు జోష్ వస్తుంది. డైలాగ్స్ పేల్చడంలో ఆయనది ప్రత్యేకమైన స్టైల్. పవన్‌కల్యాణ్‌తో 'బద్రి' లాంటి హిట్‌తో బోణీ కొట్టి.. 'ఇండస్ట్రీలో ఎలాగొలా బతకడానికి రాలేదు. హిట్ సినిమాలు తీయడానికే వచ్చానం'టూ సక్సెస్‌ల పరంపర కొనసాగించారు. టాప్ హీరోలతో బ్లాక్‌బస్టర్స్ తీసి అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమైన 'ఆలీతో సరదాగా' కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఎన్నో సరదా సంగతులు పంచుకున్నారు. మరోసారి అవేంటో చూసేద్దామా!
పవన్‌కు నచ్చినా..
'ఇడియట్', 'అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి', 'పొకిరి'.. ఈ మూడు కథలను పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్‌కు చెప్పినట్లు దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పారు. కథ చెబుతున్నప్పుడు పవన్ ఎంజాయ్ చేసినా.. చివరికి ఆ సినిమాల్లో ఆయన నటించలేదని పూరీ జగన్నాథ్ తెలిపారు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే రోజుల్లో తన స్నేహితుడైన హీరో రవితేజతో సినిమాలను పట్టాలెక్కించినట్లు పూరీ జగన్నాథ్ వెల్లడించారు.
కుదిరితే పటాయాలోనే
థాయ్‌లాండ్‌లోని పటాయా బీచ్ అంటే తనకెంతో ఇష్టమని దర్శకుడు పూరీ జగన్నాథ్ వెల్లడించారు. ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే తాను వెళ్లే మొదటి ప్రదేశం అదేనని చెప్పారు. కుదిరితే అక్కడే చనిపోవాలనే కోరిక తనకు ఉందని ఆయన తెలిపారు.
ఆర్జీవీ ప్రయోగాల వల్లే..
దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దగ్గర పనిచేసిన వారిలో దాదాపుగా 50 మంది డైరెక్టర్లు అయినట్లు పూరీ జగన్నాథ్ అన్నారు. కథలతో ప్రయోగాలు చేయడం వల్లే ఆయనకు ఫ్లాప్‌లు ఎదురవుతున్నాయని తెలిపారు. అలాంటి ప్రయోగాల వల్ల చాలా మందికి లైఫ్ వచ్చిందని వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి.. పెళ్లి అయినా.. గ్లామర్ డోస్ తగ్గించేదే లే!