నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో 'బిగ్‌బాస్ సీజన్5'(bigg boss telugu5). రెండో వారానికి సంబంధించి నామినేషన్(bigg boss telugu 5 elimination) ప్రక్రియ సోమవారం జరిగింది. ప్రస్తుతం ఇంటిలో 18 మంది సభ్యులు ఉండగా.. ఊల్ఫ్, ఈగల్ టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్ ఆదేశించారు.
![Bigg boss telugu-5](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13058456_1409kajal001.jpg)
టీమ్ ఊల్ఫ్‌లో మానస్, సన్నీ విజయ్, కాజల్, శ్వేత వర్మ, లహరి, రవి, నటరాజ్, జస్వంత్, ఉమాదేవిలు ఉండగా, టీమ్ ఈగల్‌లో లోబో, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, అనీ మాస్టర్, హమీదా, విశ్వ, షణ్ముకలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎదుటి టీమ్‌లో ఉన్న ఇద్దరు సభ్యులను ఎంపిక చేసుకుని వాళ్లు హౌస్‌లో ఉంటానికి ఎందుకు అర్హులు కారో సరైన కారణాలు చెబుతూ, వాళ్ల ముఖానికి ఎరుపు రంగు పూయాలని బిగ్‌బాస్ ఆదేశించాడు.
![Bigg boss telugu-5](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13058456_1409priyanka1.jpg)
ఈ నామినేషన్(bigg boss telugu 5 voting results) ప్రక్రియలో రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు గట్టిగానే జరిగాయి. శ్వేతవర్మ, ఉమాదేవి, అని మాస్టర్, లోబో తదితరులు కాస్త తీవ్రంగానే స్పందించారు. చివరిగా ఊల్ఫ్ టీమ్ నుంచి ఉమాదేవి, నటరాజ్, కాజల్ నామినేట్ కాగా, ఈగల్ టీమ్ నుంచి లోబో, ప్రియాంక, ప్రియ, అని మాస్టర్‌లు రెండో వారానికి నామినేట్ అయ్యారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.
ఇదీ చూడండి: రూ.400కోట్లతో అజయ్‌దేవగణ్ కొత్త సినిమా!