ETV Bharat / sitara

రివ్యూ: కార్గిల్‌ గర్ల్ 'గుంజన్'‌ ఆకట్టుకుందా?

జాన్వీ కపూర్​ ప్రధానపాత్రలో నటించిన 'గుంజన్​ సక్సేనా: ది కార్గిల్​ గర్ల్'.. ప్రేక్షకుల ముందుకొచ్చింది. యుద్ధ పైలట్​ గుంజన్​ పాత్రలో జాన్వీ మెప్పించిందా? సినిమా ఏమేరకు ఆకట్టుకుంది?

Gunjan Saxena The Kargil Girl
గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్
author img

By

Published : Aug 12, 2020, 11:42 AM IST

చిత్రం: గుంజన్‌ సక్సేనా:ది కార్గిల్‌ గర్ల్‌

నటీనటులు: జాన్వీ కపూర్‌, పంకజ్‌ త్రిపాఠి, అంగద్‌ బేడీ, వినీత్‌ కుమార్‌సింగ్‌, మానవ్‌ విజ్‌ తదితరులు

సంగీతం: జాన్‌ స్టీవర్ట్‌, అమిత్‌ త్రివేది

నిర్మాణం: ధర్మా ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌

దర్శకత్వం: శరణ్‌ శర్మ

విడుదల తేదీ: 12-08-2020(నెట్‌ఫ్లిక్స్‌)

లాక్‌డౌన్‌ వల్ల కొన్ని సినిమాలు థియేటర్లు తెరిచే వరకూ ఎదురు చూడకుండా ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఇందులో విడుదలవగా.. 'గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌' కూడా ఓటీటీలోనే విడుదలైంది. అలనాటి తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌ టైటిల్‌ రోల్‌ పోషించింది. నెట్‌ఫ్లిక్స్‌లో నెటిజన్ల ముందుకు బుధవారం వచ్చింది. ది కార్గిల్‌ గర్ల్‌గా పేరొందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే నట ప్రస్థానం ప్రారంభించిన జాన్వీ.. గుంజన్‌గా ఓటీటీ తెరపై ఎంత మేరకు ఆకట్టుకుంటుంది?

Gunjan Saxena The Kargil Girl
గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్

కథేంటంటే..

గుంజన్‌ సక్సేనా(జాన్వీ కపూర్‌) చిన్నతనంలో విమానం నడిపే పైలట్‌ను చూసి.. తాను కూడా పైలట్‌ అవ్వాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమెకు పైలట్‌ శిక్షణ ఇప్పించేంత డబ్బు తన తండ్రి(పంకజ్‌ త్రిపాఠి) వద్ద లేకపోవడం వల్ల ఎయిర్‌ఫోర్స్‌ పైలట్‌ అవుతానంటుంది. అందరూ గుంజన్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. తండ్రి మాత్రం ప్రోత్సహిస్తాడు. దీంతో ఎయిర్‌ఫోర్స్‌లో చేరేందుకు ప్రయత్నిస్తుంది. ఎంపికవడం కోసం తన బరువును సైతం తగ్గించుకుంటుంది. ఎట్టకేలకు ఎయిర్‌ఫోర్స్‌కు ఎంపికై శిక్షణ తీసుకొని విధుల్లో చేరుతుంది. అయితే గుంజన్‌ విధులు నిర్వహించే శిబిరంలో ఉండేవాళ్లంత పురుషులే. తొలిసారి ఓ మహిళా పైలట్‌ కావడం వల్ల ఆమెపై లింగవివక్ష చూపిస్తారు. ఈ క్రమంలో గుంజన్‌కు అనేక అవమానాలు, ఇబ్బందులు ఎదురవుతాయి. వీటన్నింటిని ఎదుర్కొని గుంజన్‌ మంచి పైలట్‌గా ఎలా గుర్తింపు పొందింది? కార్గిల్‌ యుద్ధంలో ఎవరు చేయలేని సాహసాలు ఆమె ఎలా చేయగలిగింది? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Gunjan Saxena The Kargil Girl
గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌

ఎలా ఉందంటే..

దేశభక్తి సినిమాలు వేరు.. ప్రముఖుల బయోపిక్స్‌ వేరు. కానీ ఈ చిత్రం గుంజన్‌ సక్సేనా జీవితాన్ని ఆవిష్కరించడం సహా దేశభక్తిని చాటుతుంది. ఒక బయోపిక్‌కు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. గుంజన్‌ పైలట్‌ అవ్వాలని నిర్ణయించుకున్న నాటి నుంచి ఆమె ఎదుర్కొన్న ప్రతి సవాలును చిత్రంలో చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు శ్రవణ్‌ శర్మ. 90వ దశకం.. అప్పుడప్పుడే మహిళలు అన్ని రంగాల్లో అడుగుపెడుతున్న సమయది. అప్పట్లో లింగవివక్ష ఎలా ఉండేదో గుంజన్‌ను చూస్తే అర్థమైపోతుంది. అదే సమయంలో కూతురు ఉన్నత శిఖరాలు అందుకోవాలని కాంక్షించే తండ్రి పాత్ర కనిపిస్తుంది. మహిళా కష్టాలు, దేశభక్తినే కాదు.. తండ్రికూతురు మధ్య ఉండే బంధాన్ని కూడా దర్శకుడు ఎంతో చక్కగా చూపించారు. యుద్ధ సన్నివేశాలతో ఉత్కంఠకు గురిచేశారు. ప్రథమార్ధంలో గుంజన్‌ పైలట్‌ అవడం కోసం పడే కష్టాలు.. ద్వితీయార్ధంలో విధుల్లో చేరాక ఎదురయ్యే ఇబ్బందులను చూపించారు. ఆ తర్వాత కార్గిల్‌ యుద్ధంలో గుంజన్‌ చూపించే తెగువతో ఆమె ప్రతిభ ఏంటో అందరికి అర్థమవుతోంది. హెలికాప్టర్‌ సన్నివేశాలు ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఈ చిత్రంలో ఎక్కడా నాటకీయతకు, అనవసర సన్నివేశాలకు తావు ఇవ్వలేదు. అసాంతం సినిమాను ఆకట్టుకునే విధంగా తీశారు. సంభాషణలు తక్కువగా ఉన్నా అర్థవంతంగా ఉంటాయి.. ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి.

ఎవరెలా చేశారంటే..

ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో జాన్వీకపూర్‌ నటనకు వందకు వంద మార్కులు వేయొచ్చు. కెరీర్‌ ప్రారంభంలోనే ఓ గొప్ప వ్యక్తి బయోపిక్‌లో నటించే అవకాశం పొందడమే కాదు.. ఆ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తొలి చిత్రం 'ధడక్‌'తోనే నటిగా తానెంటో నిరూపించుకున్న జాన్వీ ఈ చిత్రంతో నటనలో మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. సంతోషం, దుఖం ఇలా అన్ని భావోద్వేగాలున్న గుంజన్‌ పాత్రలో జాన్వీ ఒదిగిపోయింది. ఇక ఇందులో మరో కీలకమైన గుంజన్‌ తండ్రి పాత్రలో పంకజ్‌ త్రిపాఠి మెప్పించారు. ఆయన నటనే ఈ సినిమాకు ఓ బలంగా మారింది. త్రిపాఠి డైలాగ్‌ డెలివరీ, హావభావాలు ఈ సినిమాకి హైలట్‌. ఇక మిగతా నటీనటులు వారి పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.

Gunjan Saxena The Kargil Girl
గుంజన్‌ సక్సెనా: ది కార్గిల్‌ గర్ల్‌

తొలి సినిమానే బయోపిక్‌ను ఎంచుకొని శ్రవణ్‌ శర్మ సాహసమే చేశాడు. అయినా ఎంతో అనుభవజ్ఞుడిలా సినిమాను చిత్రీకరించారు. పాత్రలను మలిచిన విధానంలో, కథనంలో ఎక్కడా తడబడలేదు. తన ప్రతిభను చాటుకున్నాడు. సంగీతం ఫర్వాలేదనిపిస్తుంది. సినిమాటోగ్రఫీని మెచ్చుకోవాల్సిందే. యుద్ధ సన్నివేశాలను సహజంగా చిత్రీకరించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

బలాలు

+ కథ

+ జాన్వీ కపూర్‌, పంకజ్‌త్రిపాఠి నటన

+ భావోద్వేగ సన్నివేశాలు

బలహీనతలు

- సంగీతం

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

చివరగా: 'గుంజన్‌ సక్సేనా' జీవితాన్ని, జాన్వీ నటనను చూడాల్సిందే

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.