ETV Bharat / sitara

గోవాలో 'ఇఫి' వేడుకలు.. ప్రముఖుల సందడి

గోవా వేదికగా 51వ ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఆఫ్​ ఇండియా (ఇఫి) వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో 250 మంది కంటే ఎక్కువగా అనుమతి ఇవ్వలేదు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ సహా పలువురు హాజరయ్యారు.

Film stars descend virtually as 51st IFFI begins with precaution amid COVID-19 pandemic
గోవాలో ప్రారంభమైన 'ఇఫి' చిత్రోత్సవం
author img

By

Published : Jan 17, 2021, 9:00 AM IST

Updated : Jan 17, 2021, 9:14 AM IST

51వ ఇంటర్నేషనల్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ ఆఫ్ ఇండియా (ఇఫి) వేడుకలు గోవాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో 250 మందికి మించకుండా అన్ని రకాల మార్గదర్శకాలు పాటిస్తూ ఎంతో జాగ్రత్తగా వేడుకల్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్​ సావంత్​, బంగ్లాదేశ్ హైకమిషనర్​ మహ్మద్​ ఇమ్మాన్​ హాజరయ్యారు.

గతేడాది జరిగిన స్వర్ణోత్సవాల్లో అమితాబ్​ బచ్చన్​, రజనీకాంత్​, షారుక్​ ఖాన్​ వంటి అగ్రతారాలు పొల్గొనగా.. ఈ సారి సుదీప్​, టిస్కా చోప్రా, మనోజ్​ జోషి, ప్రియదర్శన్​ తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఆరంభ వేడుకల్లో భాగంగా ప్రముఖ ఛాయగ్రాహకుడు విట్టోరియో స్టోరారోకు జీవిత సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు బిశ్వబిత్​ ఛటర్జీకి ఇండియన్​ పర్సనాలిటీ ఆఫ్​ ది ఇయర్​ అవార్డును ప్రకటించారు.

వేడుకల్లో తొలి చిత్రంగా థామస్​ వింటర్​బర్గ్​ రూపొందించిన 'అనదర్​ రౌండ్​' చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రస్తుతం జరుగుతోన్న 51వ ఇఫి వేడుకల్లో మొత్తం 224 సినిమాలు వివిధ విభాగాల కింద పోటీ పడబోతున్నాయి. వీటిలో 15 గోల్డెన్​ పీకాక్​ అవార్డుకు పోటీ పడతాయి. ఈ ఉత్సవంలో ఇటీవల కన్నుమూసిన ఇర్ఫాన్​ ఖాన్​, సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​, రిషి కపూర్​, హాలీవుడ్​ స్టార్​ చాడ్విక్​ బోస్​మాన్​.. ఇంకా ప్రపంచ సినిమాకు చెందిన 28 మంది కళాకారులను వారి చిత్రాలను ప్రదర్శిస్తూ నివాళి అర్పిస్తారు.

ఇదీ చూడండి: 'ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో తెలుసుకున్నా!'

Last Updated : Jan 17, 2021, 9:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.