ETV Bharat / sitara

అజయ్​ దేవగణ్​ కోసం హాలీవుడ్​ యాక్షన్​​ డైరెక్టర్స్​!

author img

By

Published : Sep 29, 2020, 9:49 AM IST

ఇటీవలే 50వ వసంతంలోకి అడుగుపెట్టిన యశ్​రాజ్ ఫిలిమ్స్​ సంస్థ.. ఈ ఏడాది భారీ చిత్రాలను రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో అజయ్​ దేవగణ్​ హీరోగా ఓ భారీ యాక్షన్​ చిత్రానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో అజయ్​​ విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం.

YRF to Rope in Hollywood & Korean Action Directors for Ajay Devgan's Next Film
అజయ్​ దేవగణ్​ కోసం హాలీవుడ్ యాక్షన్​​ డైరెక్టర్స్​!

యశ్​రాజ్​ ఫిలిమ్స్​ 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఏడాదిలో భారీ చిత్రాలు తెరకెక్కించడానికి ఆ నిర్మాణ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రముఖ బాలీవుడ్​ కథానాయకుడు అజయ్​ దేవగణ్​తో ఓ భారీ యాక్షన్​ చిత్రానికి రంగం సిద్ధం చేస్తోంది. పూర్తిస్థాయి యాక్షన్​ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో అజయ్​ విభిన్న పాత్రల్లో కనిపిస్తాడని సమాచారం. వాటిల్లో ప్రతినాయక ఛాయలున్న పాత్ర కూడా ఉందని యశ్​రాజ్​ ఫిలిమ్స్​ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైవిధ్యమైన గెటప్​ల కోసం ప్రోస్థటిక్స్​ను ఉపయోగించనున్నారట.

ఇది సూపర్​ హీరో తరహా కథ కాదు కానీ యాక్షన్​కు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చిత్రవర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలోని యాక్షన్​ సన్నివేశాల కోసం నిర్మాత ఆదిత్యా చోప్రా హాలీవుడ్​ యాక్షన్​ డైరెక్టర్స్​తో సంప్రదింపులు జరుపుతున్నారట. 'ది డార్క్​ నైట్​', 'డన్​క్రిక్​' తదితర చిత్రాలకు పనిచేసిన టామ్​ స్ట్రుథెర్స్​, సౌత్​ కొరియన్​ యాక్షన్​ డైరెక్టర్​ సీయంగ్​ హోలు అజయ్​ చిత్రం కోసం పనిచేయనున్నారట. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ కథానాయిక అనన్యా పాండే సోదరుడు అహాన్​ పాండే తెరకు పరిచయం కాబోతున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.