ETV Bharat / sitara

KGF 2: రాఖీ భాయ్​ మాస్ లుక్.. ప్రమాదం వచ్చేస్తోంది! - కేజీఎఫ్​ రిలీజ్​ డేట్​

Yash KGF 2 release date: శనివారం 'కేజీఎఫ్'​ హీరో యశ్​ పుట్టినరోజు సందర్భంగా ఓ సర్​ప్రైజ్​ ఇచ్చింది కేజీఎఫ్​ చిత్రబృందం. యశ్​కు సంబంధించిన సరికొత్త పోస్టర్​ను రిలీజ్​ చేసింది. సినిమాను ఏప్రిల్‌ 14నే విడుదల చేస్తామని మరోసారి అధికారికంగా ప్రకటించింది.

kgf
కేజీఎఫ్​
author img

By

Published : Jan 8, 2022, 11:31 AM IST

Yash KGF 2 release date: కన్నడ స్టార్‌ యశ్‌ను కోట్లాదిమంది సినీ ప్రియులకు దగ్గర చేసిన చిత్రం 'కేజీఎఫ్‌'. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పార్ట్ 2 గతేడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కరోనా కారణంగా అనేక పర్యాయాలు వాయిదా పడింది. ఈ క్రమంలోనే వేసవి కానుకగా ఈ ఏడాది ఏప్రిల్‌ 14న 'కేజీఎఫ్‌-2'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతేడాది ప్రకటించారు. ఈ నేపథ్యంలో శనివారం యశ్‌ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్రబృందం స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. 'కేజీఎఫ్‌-2' సరికొత్త పోస్టర్‌ విడుదల చేసింది. "గమనిక: ప్రమాదం ముందుంది" అని పేర్కొంటూ షేర్‌ చేసిన ఈ పోస్టర్‌లో ఏప్రిల్‌ 14నే చిత్రాన్ని విడుదల చేస్తామని మరోసారి అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలో ఎలాంటి మార్పులు లేకపోవడం వల్ల సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

kgf release date
కేజీఎఫ్‌-2 రిలీజ్​ డేట్​

'కేజీఎఫ్‌'కు సీక్వెల్​గా ఈ సినిమా సిద్ధమైంది. ఈ చిత్రానికి ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 'అధీరా' పాత్రలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌, టాలీవుడ్‌ నటుడు రావు రమేష్‌, ప్రకాశ్‌రాజ్‌ కీలకపాత్రలు పోషించారు.

ఇదీ చూడండి: చమ్కీ కాంతుల్లో ఊర్వశి.. శ్రద్ధా ఘాట్​ పోజులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.