ETV Bharat / sitara

అక్షయ్​ 'గే' అని అమ్మ చెప్పింది! - అక్షయ్​ కుమార్​ న్యూస్

బాలీవుడ్​ కథానాయకుడు అక్షయ్​కుమార్.. ఓ స్వలింగ సంపర్కుడని అతడి భార్య ట్వింకిల్​ ఖన్నా తల్లి డింపుల్ కపాడియా అభిప్రాయపడ్డారట. వీరిద్దరి వివాహ ప్రస్తావన గురించి చర్చించే క్రమంలో డింపుల్ ఈ విషయాన్ని వెల్లడించినట్లు ట్వింకిల్​ ఖన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ​

What made Dimple Kapadia think Akshay Kumar is gay?
అక్షయ్​ కుమార్​ 'గే' అని ఆమె చెప్పింది: ట్వింకిల్​ ఖన్నా
author img

By

Published : May 11, 2020, 11:02 AM IST

బాలీవుడ్​ స్టార్​హీరో అక్షయ్​కుమార్​ స్వలింగ సంపర్కుడని అతడి భార్య ట్వింకిల్​ ఖన్నా తల్లి డింపుల్​ కపాడియా అభిప్రాయపడ్డారట. ఈ విషయాన్ని ట్వింకిల్​ ఖన్నా తాజాగా వెల్లడించింది. వారిద్దరి పెళ్లి ప్రస్తావన తర్వాత ఆమె తల్లి ఎలా స్పందించిందో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

"నేను, అక్షయ్​.. మా వివాహం గురించి మా అమ్మ దగ్గర ప్రస్తావించాము. అక్షయ్​ వెళ్లిన తర్వాత నాకు ఓ మాట చెప్పాలని మా అమ్మ అంది. కానీ, నాకు వెంటనే చెప్పమని అడగ్గా.. అక్షయ్​ స్వలింగ సంపర్కుడని ఆమె స్నేహితుల ద్వారా తెలిసిందని చెప్పింది. ఆ మాటతో నాకు మూర్ఛపోయినంత పనైంది." - ట్వింకిల్​ ఖన్నా, అక్షయ్​ కుమార్​ భార్య

ఆ తర్వాత ట్వింకిల్​ తల్లి.. వీరిద్దరూ ఒక ఏడాదిపాటు సహజీవనం చేయాలన్న షరతు పెట్టింది. అలా సహజీవనం చేసిన సంవత్సరం తర్వాత 2001లో వారిద్దరి వివాహం జరిగింది. ప్రస్తుతం లాక్​డౌన్ కారణంగా అక్షయ్​, ట్వింకిల్​ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారు. ​

ఇదీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.