టాలీవుడ్లో అగ్ర దర్శకుడు వి.వి వినాయక్ కథానాయకుడుగా నటిస్తోన్న చిత్రం 'సీనయ్య'. శరభ సినిమా తెరకెక్కించిన ఎన్ నరసింహ ఈ సినిమాకు దర్శకుడు. బుధవారం వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేసింది చిత్ర బృందం.
పోస్టర్‌లో రెంచ్ పట్టుకుని, ఎర్రటి కండువా వేసుకుని కనిపించాడీ విలక్షణ దర్శకుడు. ఆయన వెనుక ఓ పాత కారు దర్శనమిచ్చింది. దీని ఆధారంగా చూస్తే అతడు ఓ గ్యారేజీ నడుపుతున్నట్లు ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కథానాయికగా సీనియర్ నటి శ్రియాను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
వినాయక్ దర్శకత్వంలో 'ఆది', 'చెన్నకేశవరెడ్డి', 'దిల్', 'ఠాగూర్','ఖైదీ నంబర్150' చిత్రాలు వచ్చాయి. 2018లో విడుదలైన 'ఇంటిలిజెంట్' సినిమాను వి.వి వినాయక్ చివరిగా తెరకెక్కించాడు. సాయిధరమ్ తేజ్ కథానాయకుడు. లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనలు లభించాయి.