ETV Bharat / sitara

మోహన్​బాబు స్టైలిష్ట్​గా విష్ణు సతీమణి - Mohan Babu latest news

మంచు విష్ణు సతీమణి వెరోనికా మొదటిసారి మోహన్​బాబుకు స్టైలిష్ట్​గా వ్యవహరించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఈరోజు ప్రారంభమైంది.

Viranika Styling For Mohan Babu
మోహన్​బాబు స్టైలిష్ట్​గా ఆయన కోడలు
author img

By

Published : Oct 23, 2020, 7:53 PM IST

మంచు విష్ణు సతీమణి వెరోనికా మొదటిసారి మోహన్‌బాబు స్టైలిష్ట్‌గా వ్యవహరించనున్నారు. మోహన్‌బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న 'సన్‌ ఆఫ్‌ ఇండియా' సినిమాకు ఆమె స్టైలిష్ట్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం హైదరాబాద్‌లోని మోహన్‌బాబు నివాసంలో ప్రారంభమైంది. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ సమర్పణలో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్‌బాబు స్క్రీన్ ప్లే అందించారు.

'సన్‌ ఆఫ్‌ ఇండియా' ప్రారంభమైన సందర్భంగా మోహన్‌బాబుకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన కుమార్తె లక్ష్మీ ఓ ట్వీట్‌ పెట్టారు. "కంగ్రాట్స్‌ నాన్న! దీని కోసం నేను ఎంతో కాలంగా వేచిచూస్తున్నా. మీ అద్భుత నటనను వెండితెరపై చూడడానికి ఆసక్తిగా ఉన్నా. ఆల్‌ ది బెస్ట్‌" అని ఆమె పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.