"మా ఇంట్లో మమ్మల్నింకా చిన్న పిల్లల్లానే చూస్తున్నారు" అంటున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ 'బీ ద రియల్ మ్యాన్' సవాల్‌ని విజయ్‌కి విసిరిన సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి విజయ్ ట్విట్టర్‌లో స్పందించాడు.
"శివ సర్.. మా అమ్మ నన్ను పని చేయనీయట్లే. నేను చేస్తే పని రెట్టింపు అవుతుందట. ఇంట్లో మమ్మల్ని ఇంకా రియల్ మ్యాన్‌లా చూడట్లే. కానీ, ఈ లాక్‌డౌన్‌లో నా రోజువారీ జీవితం ఎలా ఉంటుందో ఓ వీడియో ద్వారా చూపిస్తా" అంటూ ట్వీటాడు విజయ్. తాజాగా ఈ సవాల్‌ను దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు సంపూర్ణేశ్ బాబు పూర్తి చేసి.. ఆ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
ఇదీ చూడండి: రియల్‌మ్యాన్ దర్శకుడు సుకుమార్.. ఐదుగురికి ఛాలెంజ్