వెండితెరపై యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటులలో విద్యుత్ జమ్వాల్ ఒకరు. ఇటీవల 'జంగిల్' చిత్రంలో ఏనుగులతో కలిసి పరిగెత్తడం, చెట్లపై నుంచి దూకడం, కర్రసాము వంటి ఫీట్లు చేశాడు. ఈసారి సినిమాలో లాగే నిజ జీవితంలోనూ సాహసం చేశాడీ హీరో. గ్యాస్ సిలిండర్‌ను వాటర్ బాటిల్‌ను తిప్పినట్లు అలవోకగా తిప్పిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇప్పటికే ఇన్‌స్టాలో 10 లక్షల మందికి పైగా వీక్షించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
విద్యుత్ జమ్వాల్ నటించిన 'జంగిల్' ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో పూజా సావంత్, ఆశా భట్ కథానాయికలు. అతుల్ కులకర్ణి ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ప్రస్తుతం శంకర్-కమల్ హసన్ కాంబినేషన్లో వస్తోన్న 'భారతీయుడు2'లో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఇదీ చదవండి...అందుకే 'సైరా' అక్కడ వేడుక చేసుకోబోతున్నాడట..!