బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ కరోనా నుంచి కోలుకున్నాడు. పరీక్షల అనంతరం నెగిటివ్గా తేలిందని సామాజిక మాధ్యమాల వేదికగా స్వయంగా వెల్లడించాడు. నవ్వుతున్న ఫొటోని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. తాను కోలుకోవాలని ప్రార్థించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపాడు.
ఏప్రిల్ 5న విక్కీ, నటి భూమి పెడ్నేకర్ ఒకేసారి కరోనా బారినపడ్డారు. కాగా తాజాగా విక్కీ కోలుకోగా, భూమికి సంబంధించిన ఆరోగ్య వివరాలు తెలియాల్సి ఉంది. వీరిద్దరూ 'మిస్టర్. లీలే ఇన్ ముంబయి' సినిమాలో నటిస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ బాధ తట్టుకోలేక ఏడ్చేశా: అనసూయ