ప్రముఖ నటి శశికళా ఓమ్ ప్రకాష్ సైగల్(88) ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుటుంబసభ్యులతో పాటు రచయిత కిరణ్ కోట్రియల్ సోషల్‌మీడియాలో పంచుకున్నారు. అయితే ఆమె మృతికి గల కారణాలేవి తెలిసిరాలేదు.
మహారాష్ట్రలోని సోలాపూర్‌లో జన్మించిన శశికళ.. 'కరోడ్‌పతి' సినిమాతో బాలీవుడ్లో అరంగేట్రం చేశారు. 100కు పైగా సినిమాల్లో హీరోయిన్ సహా సహాయ పాత్రలతో నటించి మెప్పించారు. ఓమ్ ప్రకాష్ సైగల్‌ను శశికళ వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం.
ఇదీ చూడండి: బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందకు కరోనా