మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ 'గద్దల కొండ గణేష్'తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తెలుగులో ప్రసారమవుతున్న ఓ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన... వ్యాఖ్యాత వేసిన ప్రశ్నకు సరదాగా సమాధానమిచ్చాడు.
మంచులక్ష్మి యాంకర్‌గా వ్యవహరిస్తున్న కార్యక్రమంలో వరుణ్‌తేజ్ పాల్గొని ఎన్నో విశేషాలను అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా మంచులక్ష్మి ఓ ప్రశ్న వేసింది. "రాశీఖన్నా, సాయిపల్లవి, పూజాహెగ్డేలలో ఎవరిని పెళ్లి చేసుకుంటావు? ఎవరిని చంపుతావు? ఎవరితో డేటింగ్‌కి వెళ్తావు?"అని అడిగింది.
వరుణ్ వెంటనే "నేను సాయిపల్లవిని పెళ్లి చేసుకుంటాను. రాశీఖన్నాను చంపుతాను. పూజాహెగ్డేతో డేటింగ్‌కు వెళ్తాను" అని సమాధానం చెప్పాడు.
'గద్దలకొండ గణేష్' చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకుడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై గోపీ ఆచంట, రామ్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో వరుణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించింది. సాయి పల్లవి, వరుణ్ జోడీగా నటించిన 'ఫిదా' సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇదీ చదవండి...