తమిళ స్టార్ హీరో ధనుశ్(Dhanush) ఓ మైలురాయిని చేరుకున్నారు. ట్విట్టర్లో కోటి(10మిలియన్) ఫాలోవర్లను అందుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి తమిళ హీరోగా గుర్తింపు పొందారు.
ధనుశ్కు ఫేస్బుక్ పేజ్‌లో 7మిలియన్లకు పైగా, ఇన్‌స్టాలో 2.8మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'ది గ్రే మ్యాన్', 'ఆయిరాథిల్ ఓరువన్ 2'(యుగానికి ఒక్కడు సీక్వెల్), 'రక్షాబంధన్', 'డీ44', 'పుధు పెట్టాయ్' సినిమాల్లో నటిస్తున్నారు.
మెగా హీరో వరుణ్ తేజ్ మంచి మనసును చాటుకున్నారు. అభిమాని కుటుంబానికి అండగా నిలిచారు. ఇటీవల కరీంనగర్‌కు చెందిన శేఖర్ అనే వ్యక్తి కన్నుమూశారు. అది తెలుసుకున్న వరుణ్.. ఆయన కుటుంబానికి తన వంతుగా రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సాయం చేశారు.
ప్రస్తుతం ఈ మెగాహీరో 'ఎఫ్ 3', 'గని' చిత్రాల్లో నటిస్తున్నారు.
ప్రముఖ దర్శకులు మణిరత్నం (Mani Ratnam)-జయేంద్ర (Jayendra Panchapakesan).. నిర్మిస్తున్న'నవరస'(Navarasa) నుంచి 'నానుమ్' అనే పాటను.. జులై 19న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సిరీస్‌లో సూర్య(Suriya)తో పాటు అరవింద స్వామి, సిద్దార్థ్, విజయ్ సేతుపతి, ప్రకాశ్ రాజ్, రేవతి, నిత్యా మేనన్, పార్వతి, ఐశ్వర్య రాజేశ్, పూర్ణ, ప్రసన్న, సింహా, గౌతమ్ కార్తిక్, అశోక్ సెల్వన్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు.
సందీప్ కిషన్, బాబీ సింహా ప్రధానపాత్రల్లో నటిస్తున్న సినిమా 'గల్లీ రౌడీ'. ఈ సినిమాకు సంబంధించిన ప్రోమోను జులై 19న సాయంత్రం 4గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కోనా ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
-
Bringing you the #ItemSongofTheYear from #GullyRowdy, Promo releasing tomorrow at 4pm⏳
— Mango Music (@MangoMusicLabel) July 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Stay tuned to @mangomusiclabel@sundeepkishan @actorsimha @iamnehashetty #GNageswaraReddy @iamMangli #Dattu @iamsaikartheek @bhaskarabhatla @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp pic.twitter.com/mVHjQKaubR
">Bringing you the #ItemSongofTheYear from #GullyRowdy, Promo releasing tomorrow at 4pm⏳
— Mango Music (@MangoMusicLabel) July 18, 2021
Stay tuned to @mangomusiclabel@sundeepkishan @actorsimha @iamnehashetty #GNageswaraReddy @iamMangli #Dattu @iamsaikartheek @bhaskarabhatla @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp pic.twitter.com/mVHjQKaubRBringing you the #ItemSongofTheYear from #GullyRowdy, Promo releasing tomorrow at 4pm⏳
— Mango Music (@MangoMusicLabel) July 18, 2021
Stay tuned to @mangomusiclabel@sundeepkishan @actorsimha @iamnehashetty #GNageswaraReddy @iamMangli #Dattu @iamsaikartheek @bhaskarabhatla @konavenkat99 @MVVCinema_ @KonaFilmCorp pic.twitter.com/mVHjQKaubR
టాలీవుడ్ యువ నటుడు సత్యదేవ్(Satyadev Kancharana) ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'తిమ్మరుసు'(Thimmarusu). ఆయన ఇందులో న్యాయవాది పాత్రలో కనిపించనున్నారు. తాజాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ పాటను విడుదల చేశారు. ఈ సినిమా జులై 30న థియేటర్లలో విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: సూర్య 'నవరస' తొలిరూపు.. 'తిమ్మరుసు' రిలీజ్ రైట్స్