ప్రతినాయక ఛాయలున్న పాత్ర పోషించేందుకు వరుణ్‌తేజ్ సిద్ధమవుతున్నాడు. 'వాల్మీకి' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ రోజు నుంచే షూటింగ్లో పాల్గొన్నాడీ మెగాహీరో. సంబంధిత విషయాన్ని ట్విట్టర్లో పంచుకున్నాడు.
తమిళ నటుడు అథర్వ హీరోగా కనిపించనున్నాడు. డబ్స్మాష్ ఫేం మృణాళిని రవి హీరోయిన్గా నటించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో 35 రోజుల పాటు షెడ్యూల్ జరుపుకోనుంది.
తమిళంలో 'జిగర్తాండ' పేరుతో తెరకెక్కిన సినిమాకు రీమేక్ ఈ వాల్మీకి. సిద్దార్థ్, లక్ష్మీ మేనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహా విలన్‌గా కనిపించాడు.
ఇది చదవండి: కొడుకు పేరునే దొంగిలించిన తండ్రి..!