బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలు, ఫ్యాషన్ డిజైనర్ నటాషా దలాల్‌ను జనవరి 24న వివాహమాడనున్నాడని సమాచారం. ముంబయిలోని అలీబాగ్‌లో అతికొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వేడుక జరగనుందని తెలుస్తోంది.
అలీబాగ్‌లో బీచ్‌కు అభిముఖంగా ఉన్న ఓ రిసార్ట్‌ను ధావన్ కుటుంబం పూర్తిగా బుక్ చేసుకుందని సమాచారం. జనవరి 22 నుంచి 25 వరకు ఈ కార్యక్రమం జరగనుందని తెలుస్తోంది. నిరాడంబరంగా ఈ వివాహవేడుకను నిర్వహించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించినట్లు సమాచారం.
బయోబబుల్ నిబంధనలను పాటిస్తూ ఇరు కుటుంబాలు, సన్నిహితులు ఇప్పటికే రిసార్ట్‌లో ఉంటున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ నెలాఖరున బాలీవుడ్ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఉంటుందని తెలుస్తోంది. వరుణ్‌కు ఆయన తండ్రి డేవిడ్‌కు పంజాబీ స్టైల్లో ఘనంగా వివాహం జరిపించాలి అని ఉన్నా.. కొవిడ్ నేపథ్యంలో ఆ ఆలోచనను విరమించుకున్నాడని సమాచారం.
ఇదీ చూడండి: పవన్-రానా మల్టీస్టారర్‌లో సముద్రఖని