ETV Bharat / sitara

'వరుడు కావలెను' ట్రైలర్​.. భూమి, ఆకాశం ఎప్పటికీ కలవలేవు! - నాగశౌర్య వరుడు కావలెను ట్రైలర్

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu movie). తాజాగా ఈ సినిమా ట్రైలర్​ను విడుదల చేశారు నటుడు దగ్గుబాటి రానా.

Varudu Kavalenu
వరుడు కావలెను
author img

By

Published : Oct 21, 2021, 9:32 PM IST

నాగశౌర్య, రీతూ వర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu movie). లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరాలందిస్తున్నారు. ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది(varudu kaavalenu release date). ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు రానా ట్రైలర్‌(varudu kaavalenu trailer)ను విడుదల చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

'పెళ్లి చూపుల కాన్సెప్టే మా అమ్మాయికి పడదు' అని కథానాయిక (రీతూ) తల్లి చెప్పిన డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌(varudu kaavalenu trailer) సందడిగా సాగింది. పెళ్లి చూపులు కాన్సెప్ట్‌ అంటేనే ఇష్టంలేని ఆ అమ్మాయిని ఇంప్రెస్‌ చేసే ప్రయత్నం చేస్తుంటాడు శౌర్య. ఈ క్రమంలో అదంత తేలికైన విషయం కాదని తెలుసుకుంటాడు. కట్‌ చేస్తే, ఒకానొక సందర్భంలో ఇరువురి మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటాయి. 'భూమి, ఆకాశం.. ఎదురెదురుగా ఉన్నా ఎప్పటికీ కలవలేవు' అంటూ శౌర్యని దూరంపెడుతుంది రీతూ. మరి ఈ ఇద్దరి మధ్యా విభేదాలకు కారణమేంటి? వివాహం చేసుకుంటారా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చూడండి: 'ఎనిమీ' రిలీజ్ డేట్.. 'ఎఫ్​ 3'లో బాలయ్య భామ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.