శ్రీదేవి అంటే సగటు ప్రేక్షకుడి దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అమితమైన అభిమానం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో రామ్గోపాల్ వర్మ ముందు వరుసలో ఉంటాడు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆమెపై అభిమానాన్ని వినూత్నంగా ప్రదర్శించాడు.
తనను శ్రీకృష్ణుడిగా చూపించుకుంటూ..శ్రీదేవిని గోపికగా మార్చి ఓ సరదా వీడియోను రూపొందించి ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు వర్మ.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇలా సరదాగా సాగిన వీడియో ఆకర్షిస్తోంది. శ్రీదేవిపై అభిమానాన్ని శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున చూపించడం ఆసక్తికరంగా ఉందంటూ నెటిజన్లు విశేషంగా స్పందిస్తున్నారు.
ఇది చదవండి: 'నన్ను ట్రోల్ చేయండి.. నాపై మీమ్స్ వేయండి'