ETV Bharat / sitara

ఎన్టీఆర్​​ సినిమాలో పొలిటిషియన్​గా 'జయమ్మ'

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ కాంబినేషన్​లో రూపొందనున్న చిత్రంలో నటి వరలక్ష్మీ శరత్​కుమార్​ కీలకపాత్రలో ఎంపికైనట్లు సమాచారం. సినిమాలోని ఓ రాజకీయ నాయకురాలి పాత్ర కోసం చిత్రబృందం ఆమెను సంప్రదించినట్లు టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

varalaxmi sarathkumar to play politician role in Ntr 30!
ఎన్టీఆర్​​ సినిమాలో పొలిటిషియన్​గా 'జయమ్మ'
author img

By

Published : Mar 5, 2021, 6:08 PM IST

'అరవింద సమేత' తర్వాత తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్నట్లు కొంతకాలం క్రితం ప్రకటించారు. ప్రస్తుతం 'ఆర్‌ఆర్‌ఆర్‌' షూట్‌లో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌ త్వరలోనే ఈ సినిమా సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. #NTR30గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయంపై నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఓ పవర్‌ఫుల్‌ కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్రలో కనిపించనున్నట్లు సమాచారం.

'క్రాక్‌', 'నాంది' చిత్రాల్లో వరలక్ష్మి నటన చూసి ఫిదా అయిన త్రివిక్రమ్‌ 'NTR30'లో ఓ రోల్‌ ఆఫర్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె ఈ సినిమాలో పవర్‌ఫుల్‌ రాజకీయ నాయకురాలిగా కనిపించే అవకాశాలున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇప్పటికే 'సర్కార్‌', 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌' చిత్రాల్లో రాజకీయ నాయకురాలి పాత్రను పోషించి వరలక్ష్మి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక, తారక్‌ సినిమా విషయానికి వస్తే.. 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది.

ఇదీ చూడండి: నాన్న వద్దన్నా సినిమాల్లోకి.. 'జయమ్మ'గా మన మనసుల్లోకి​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.