మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్, హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న 'వాల్మీకి' సెప్టెంబర్ 13న విడుదలకు సిద్ధమౌతోంది. ఈ చిత్రంలో హైదరాబాద్ అమ్మాయి 'డింపుల్ హయాతీ' ఓ ప్రత్యేక గీతంలో నర్తించబోతోంది. 'దేవి 2' సినిమాలో ప్రభుదేవాతో కలిసి కీలక పాత్రలో కనిపించింది డింపుల్. 2017లో గల్ఫ్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ అమ్మడు... ప్రస్తుతం 'యురేకా' చిత్రంలో నటిస్తోంది.
తమిళ నటుడు అథర్వ మురళి ప్రతినాయకుడి పాత్రగా కనిపించనున్నాడు. పూజా హెగ్డే కథానాయిక. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘జిగర్తాండ’కు రీమేక్‌గా రూపొందుతోందీ సినిమా. మిక్కి జే.మేయర్ సంగీతం అందిస్తుండగా... 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- — Harish Shankar .S (@harish2you) July 25, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
— Harish Shankar .S (@harish2you) July 25, 2019
">— Harish Shankar .S (@harish2you) July 25, 2019