ETV Bharat / sitara

థియేటర్, ఓటీటీలో ఈ వారం సందడి చేసే చిత్రాలివే! - ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలు

ఈ వారం అటు థియేటర్‌ (New movie release in Theaters), ఇటు ఓటీటీలోనూ (New movie release in OTT) సినిమాల సందడి రెట్టింపు కానుంది. కరోనా పరిస్థితులు కాస్త కుదుటపడుతున్న నేపథ్యంలో ఈసారి పలు భాషల్లోని సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరి వినాయకచవితిని పురస్కరించుకుని ఆ సందడి పంచే చిత్రాలేంటో చూద్దాం.

Upcoming movies in September second week
ఈ వారం రిలీజ్​కు రెడీగా ఉన్న సినిమాలు
author img

By

Published : Sep 6, 2021, 12:09 PM IST

ఈ వారం విడుదలయ్యే సినిమాలు

కరోనా సెకండ్‌వేవ్‌ తర్వాత పరిస్థితులు కాస్త కుదుటపడిన నేపథ్యంలో థియేటర్‌లలో వరుసగా సినిమాలు విడుదలవుతున్నాయి. అయితే, అసలైన జోష్‌ మాత్రం రావడం లేదు. ఇంకా కరోనా భయాలు వీడకపోవడం, నిబంధనల కారణంగా ఏపీలో థియేటర్‌లు పూర్తిగా అందుబాటులో లేకపోవడం దీని కారణం. కొన్ని సినిమాలు ధైర్యంతో థియేటర్‌కు వచ్చేందుకు మొగ్గు చూపుతుంటే, మరికొన్ని ఇప్పటికీ ఓటీటీ బాట పడుతున్నాయి. అయితే, గత నెల రోజులతో పోలిస్తే, ఈ వారం అటు థియేటర్‌ (New movie release in Theaters), ఇటు ఓటీటీలోనూ (New movie release in OTT) కాస్త సందడి రెట్టింపు కానుంది. మరి వినాయకచవితిని పురస్కరించుకుని ఆ సందడి పంచే కథానాయకులు ఎవరు? ఏయే చిత్రాలు వస్తున్నాయి?

'లాభం'తో మొదలు

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటిస్తున్న తమిళ చిత్రం 'లాభం'(Vijay Sethupathi Labham). శ్రుతిహాసన్‌ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌.పి.జననాథన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం అదే పేరుతో తెలుగులోనూ విడుదల కానుంది. సెప్టెంబరు 9న థియేటర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పచ్చని పొలాల్లో ఫ్యాక్టరీ కట్టాలనుకునే వ్యాపారవేత్తగా జగపతిబాబు, అది జరగకుండా రైతుల పక్షాన నిలిచే వ్యక్తిగా విజయ్‌ సేతుపతి కనిపించారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ అలరిస్తోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన విజయ్‌సేతుపతి ‘లాభం’లో ఈసారి ఎలా మెప్పిస్తారో చూడాలి. విజయ్‌సేతుపతి, పి.అరుముగకుమార్‌ నిర్మించిన ఈ సినిమాకు ఇమ్రాన్‌ సంగీతం అందించారు.

థియేటర్‌లో 'కబడ్డీ కూత'.. 'సీటీమార్‌'తో మోత

గోపీచంద్‌ కథానాయకుడిగా సంపత్‌ నంది దర్శకత్వంలో తెరకెక్కిన స్పోర్ట్స్‌ యాక్షన్‌ డ్రామా 'సీటీమార్'(Seeti Maar movie release date). తమన్నా కథానాయిక. వేసవి కానుకగా రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇందులో గోపీచంద్‌, తమన్నాలు ఆంధ్రా, తెలంగాణ కబడ్డీ జట్ల కోచ్‌లుగా కనిపించనున్నారు. గోపీచంద్‌ నుంచి అభిమానులు కోరుకునే మాస్అంశాలతో పాటు, భావోద్వేగాలను కూడా జోడించారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. దిగంగనా సూర్యవంశి, భూమిక కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జయలలిత జీవిత కథ 'తలైవి'

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా ఏఎల్‌ విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'తలైవి' (Thalaivi Trailer). కంగనా రనౌత్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి అలరించనున్నారు. వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్‌లో విడుదల కానుంది. జీవీ ప్రకాశ్‌కుమార్‌ స్వరాలు సమకూర్చారు. విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమాకు రచనా సహకారం అందించటం విశేషం. విష్ణు వర్దన్‌ ఇందూరి, శైలేష్‌ ఆర్‌ సింగ్‌, బృందా ప్రసాద్‌లు నిర్మిస్తున్నారు. జయలలిత తమిళ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా ఎలా ఎదిగారు? ఎంజీఆర్‌కు ఎలా దగ్గరయ్యారు? తమిళ రాజకీయాల్లో ప్రవేశించి ఏవిధంగా చక్రం తిప్పారన్న విషయాలను ఏఎల్‌ విజయ్‌ చూపించనున్నారు.

నిజ జీవిత ఘటనల ఆధారం 'జాతీయ రహదారి'

'1940లో ఒక గ్రామం', 'కమలతో నా ప్రయాణం', 'లజ్జ' చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు నరసింహ నంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ 'జాతీయ రహదారి'. మధుచిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి ప్రధానపాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 10న థియేటర్‌లో విడుదల కానుంది. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాల ఇతివృత్తంతో ఈ సినిమా సాగనుంది.

ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రాలు..

'టక్‌ జగదీష్‌'గా అలరించనున్న నాని

నాని కథానాయకుడిగా రూపొందిన యాక్షన్‌, కుటుంబ కథా చిత్రం 'టక్‌ జగదీష్‌' (Tak Jagadish movie release date) శివ నిర్వాణ దర్శకుడు. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేశ్‌ కథానాయికలు. వినాయకచవితి కానుకగా సెప్టెంబరు 10 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానుంది. 'నిన్నుకోరి' తర్వాత శివ నిర్వాణ-నాని కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం కావడంతో దీనిపై భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్‌లో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్య పరిణామాల తర్వాత ఓటీటీ బాటపట్టింది. భూ కక్షలు లేని భూదేవిపురం కోసం 'టక్‌ జగదీష్‌' యువకుడు ఏం చేశాడన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. నాజర్‌, జగపతిబాబు, నరేశ్‌, రావురమేశ్‌, రోహిణి కీలకపాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని షైన్‌ స్క్రీన్స్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించారు.

ఆ 'నెట్‌'లో పడితే ఇక అంతేనా?

రాహుల్‌ రామకృష్ణ, అవికాగోర్‌తో కీలక పాత్రల్లో నటించిన చిత్రం 'నెట్‌'. భార్గవ్‌ మాచర్ల దర్శకుడు. సస్పెన్స్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇందులో లక్ష్మణ్‌ అనే పాత్రలో రాహుల్‌ రామకృష్ణ కనిపించనున్నారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర షోషించారు. అశ్లీల చిత్రాలు వీక్షించే రాహుల్‌ చివరికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. సీక్రెట్‌ కెమెరాల ద్వారా ప్రియ ప్రైవేట్‌ లైఫ్‌ని వీక్షించిన రాహుల్‌ చిక్కుల్లో పడటానికి కారణమేమిటి? ప్రియ జీవితాన్ని సీక్రెట్‌ కెమెరాలతో చిత్రీకరించింది ఎవరు? తెలియాలంటే 'నెట్‌' చూడాల్సిందే.

మెడికల్‌ థ్రిల్లర్‌ ముంబై డైరీస్‌ 26/11

ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా మరో కొత్త సిరీస్‌ అలరించనుంది. 'ముంబై డైరీస్‌ 26/11' పేరుతో తెరకెక్కిన ఈ మెడికల్‌ థ్రిల్లర్‌ సెప్టెంబరు 9 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. మోహిత్‌ రైనా, కొంకణ సేన్‌ శర్మ, శ్రేయా ధన్వంతరిలు కీలక పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను నిఖిల్‌ అడ్వాణీ, నిఖిల్‌ గోన్సల్వేస్‌లు తెరకెక్కించారు. మొత్తం ఎనిమిది భాగాల్లో ఈ సిరీస్‌ ప్రసారం కానుంది. 26/11 ముంబయి దాడుల సమయంలో వైద్యులు, విలేకరులు, పోలీస్‌ ఫోర్స్‌ ఏవిధంగా పనిచేసిందన్న ఆసక్తికర అంశాలను థ్రిల్‌ కలిగించేలా సిరీస్‌ను తీర్చిదిద్దారు.

నెట్‌ఫ్లిక్స్‌లో 'తుగ్లక్‌ దర్బార్‌'

సెప్టెంబరు 9న 'లాభం' చిత్రంతో థియేటర్‌లో సందడి చేయనున్న విజయ్‌ సేతుపతి ఆ మరుసటి రోజే వినాయకచవితి సందర్భంగా సెప్టెంబరు 10న టెలివిజన్‌లో అలరించనున్నారు. ఆయన కీలక పాత్రలో తెరకెక్కిన తమిళ పొలిటికల్‌ మూవీ 'తుగ్లక్‌ దర్బార్‌' (Tughlaq Durbar trailer). రాశీ ఖన్నా, మంజిమా మోహన్‌ కథానాయికలు. దిల్లీ ప్రసాద్‌ దీనదయాళన్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను సెప్టెంబరు 10న సన్‌ టీవీ నేరుగా ప్రసారం చేయనుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో సెప్టెంబరు 11 నుంచి స్ట్రీమింగ్‌ చేయనుంది. ఓ రాజకీయ నాయకుడ్ని అమితంగా ఇష్టపడే సింగారవేలన్‌ (విజయ్‌ సేతుపతి) అనే యువకుడి పాత్రలో విజయ్‌ సేతుపతి కనిపించనున్నారు.

ఓటీటీలో అలరించే మరికొన్ని చిత్రాలు

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • లూలా రిచ్‌ (సెప్టెంబర్‌ 10)
  • మాటల్‌ కమ్‌బాట్‌ (సెప్టెంబర్‌ 11)

ఆహా!

  • ద బేకర్‌ అండ్‌ ద బ్యూటీ ( సెప్టెంబర్‌ 10)
  • మహాగణేశా ( సెప్టెంబర్‌ 10)

డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌

  • అమెరికన్‌ క్రైమ్‌స్టోరీ (సెప్టెంబర్‌ 08)

నెట్‌ఫ్లిక్స్‌

  • అన్‌టోల్డ్‌: బ్రేకింగ్‌ పాయింట్‌ (సెప్టెంబర్‌ 07)
  • ఇన్‌ టు ది నైట్‌ (సెప్టెంబర్‌ 08)
  • బ్లడ్‌ బ్రదర్స్‌ (సెప్టెంబర్‌ 09)
  • మెటల్‌ షాప్‌ మాస్టర్స్‌ (సెప్టెంబర్‌ 10)
  • లూసిఫర్‌ (సెప్టెంబర్‌ 10)
  • కేట్‌ (సెప్టెంబర్‌ 10
    హెచ్‌బీవో మ్యాక్స్‌
  • మాలిగ్‌నాంట్‌ (సెప్టెంబర్‌ 10)

జీ 5

  • డిక్కీ లూనా (సెప్టెంబర్‌ 10)
  • క్యా మేరీ సోనమ్‌ గుప్తా బెవాఫా హై (సెప్టెంబర్‌ 10)

వూట్‌

  • క్యాండీ (సెప్టెంబర్‌ 08)

ఇదీ చూడండి: బిగ్‌బాస్‌: నాగ్​ గ్రాండ్​ ఎంట్రీ.. కంటెస్టెంట్‌లు వీరే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.