ETV Bharat / sitara

Power star Pawan Kalyan: పవన్​ కోసం మరో ఇద్దరు దర్శకులు! - Bhimla Nayak Movie

భీమ్లా నాయక్(Bhimla Nayak Movie), హరి హర వీరమల్లు చిత్రాలతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు పవన్ కల్యాణ్(Power star Pawan Kalyan). ప్రస్తుతం ఇద్దరు కొత్తతరం దర్శకులు పవన్​తో(Pawan Kalyan) సినిమా తీసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

pawan kalyan
పవన్ కల్యాణ్
author img

By

Published : Sep 1, 2021, 7:07 AM IST

అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ (Power star Pawan Kalyan) రెండు చిత్రాలతో బిజీగా ఉన్నారు. 'భీమ్లానాయక్‌'(Bhimla Nayak Movie), 'హరి హర వీరమల్లు' ప్రస్తుతం సెట్స్‌పై ఉన్నాయి. మరోపక్క హరీష్‌శంకర్‌, సురేందర్‌ రెడ్డి సిద్ధం చేసిన కథలూ ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పుడు కొత్తతరం దర్శకులు ఇంకో ఇద్దరు పవన్‌ కల్యాణ్‌(Pawan Kalyan) కోసం రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. వాస్తవికతకి ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీస్తున్న ఆ దర్శకులతో రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు కథలు సిద్ధం చేయిస్తున్నాయి.

పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan news) కొత్తతరం దర్శకులతో పనిచేయడాన్ని ఇష్టపడుతుంటారు. తొలి ప్రయత్నంలోనే మంచి సినిమాలు తీసి మెప్పించిన ఆ ఇద్దరు దర్శకులు పవన్‌ మార్క్‌ అంశాలతో కథలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. వీటిపై మరికొన్ని రోజుల్లో ఓ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్‌ 2న 'భీమ్లా నాయక్‌' టైటిల్‌ గీతాన్ని విడుదల చేస్తున్నారు.

ఇదీ చదవండి:'భీమ్లా నాయక్'​ ట్రీట్​.. 'కార్తికేయ 2' హీరోయిన్ ఖరారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.