టీవీ నటుడు కుశాల్ పంజాబీ.. 'ఇష్క్ మే మర్జావా' ధారవాహికతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. శుక్రవారం ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇతడి మృతితో స్నేహితుడు కర్ణవీర్ బోహ్రా.. ట్విట్టర్లో భావోద్వేగ పోస్ట్ చేశాడు.
"నున్వు మృతి చెందావనే వార్త నన్ను నరకంలోకి తీసుకెళ్లింది. ఇప్పటికీ ఆ వార్తను నమ్మలేకపోతున్నా. సంతోషమైన జీవితాన్ని గడుపుతున్న నువ్వు.. ఇలా ఎందుకు చేశావో తెలియడం లేదు. జీవితాన్ని చూసే కోణంలో ప్రతిసారి నన్ను ఎంతగానో ఇంప్రెస్ చేశావు. ఒక డ్యాన్సింగ్ డాడీగా ఎప్పటికీ నిన్ను గుర్తుపెట్టుకుంటా"
- కర్ణవీర్, నటుడు
కర్ణవీర్ భావోద్వేగ పోస్ట్
కర్ణవీర్ పోస్టుపై స్పందించిన పలువురు నటీనటులు, నెటిజన్లు.. కుశాల్ మృతి పట్ల షాక్కు గురయ్యారు. నటి శ్వేత తివారీ.. 'వాట్... ఓ మై గాడ్... ఎప్పుడు? ఎలా?' అని కామెంట్ చేసింది. 'వాట్? ఇది ఎప్పుడు జరిగింది. ఇది నిజంగానే చాలా బాధాకరమైన విషయం. నేను నమ్మలేకపోతున్నా. అతని ఆత్మకు శాంతి చేకూరాలి' అని నటుడు వికాస్ కలాంత్రి పోస్ట్ చేశాడు.